వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా భర్త చనిపోయాడని ప్రకటించండి హైకోర్టును ఆశ్రయించిన మహిళ

తన భర్త చనిపోయాడని ప్రకటించాలని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది.తనకు న్యాయంగా చేయాలని కోరుతూ ఆమె చివరకు హైకోర్టు మెట్లెక్కింది.ఈ విషయమై హైకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: తన భర్త చనిపోయాడని ప్రకటించాలని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది.తనకు న్యాయంగా చేయాలని కోరుతూ ఆమె చివరకు హైకోర్టు మెట్లెక్కింది.ఈ విషయమై హైకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

తన భర్త చేతిలో మరణించాలని భారతీయ మహిళలు కోరుకొంటారు. సుమంగళిగానే చనిపోవాలని కోరుకొంటారు.కాని దానికి భిన్నంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ మాత్రం తన భర్త చనిపోయాడని ప్రకటించాలని కోరడం వివాదాస్పదంగా మారింది.

 sumangali filed a petition in karnataka highcourt

కర్ణాటక రాష్ట్రంలోని రామనగర ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శివకుమారస్వామితో స్థానికంగా నివాసం ఉంటున్న సుమంగళకు 2006 లో వివాహమైంది..

అయితే 2010 జనవరి 8వ, తేదిన శివకుమారస్వామి స్కూల్ కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్ళి ఇంతవరకు కన్పించకుండాపోయాడు. వారం రోజుల పాటు భర్త ఆచూకీ కోసం వెతికి ఆమె ఐజూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.అయినా ఫలితం లేకుండాపోయింది.

ఇదిలా ఉంటే శివకుమార్ పాఠశాలకు రాకపోవడంతో విద్యాశాఖ జీతాన్ని ఆపివేస్తూ నిర్ణయం తీసుకొంది.శివకుమార స్వామి జీతాన్ని నిలిపివేయడంతో సుమంగళికి కష్టాలు రెట్టింపు అయ్యాయి. కుటుంబం గడవడం కోసం బంధువులు సహయపడుతూ వచ్చారు.

ఈ విషయమై ఆమె విద్యాశాఖ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది.దీంతో 2014 లో ఆమె కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.అప్పట్లో కేసును విచారించిన కోర్టు త్వరగా శివకుమార్ జాడ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించినా ఉపయోగం లేకుండాపోయింది.

ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త చనిపోయాడని ప్రకటించాలని, తద్వారా విద్యాశాఖలో తనకు ఉద్యోగం లభిస్తోందని అందులో పేర్కొంది. ఓ వ్యక్తి కన్పించకుండా పోయి ఏడేళ్ళు దాటితే మరణించారని భావించవచ్చని ప్రభుత్వ న్యాయవాది ప్రతిమా హెన్నాపుర చెప్పారు. ఈ విషయమై కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది కోర్టు.

English summary
the karnataka high court issued notice to state governament of karnataka. sumangali filed a petition in karnataka highcourt. shiva kumar swamy working as a governament teacher.in 2010 jan 8 shivakumar disapper. shiva kumar wife sumangali filed a petition in highcourt .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X