వేసవి సెలవులే ముంచాయి..: ఉపఎన్నికల్లో ఓటమిపై బీజేపీ నేత
లక్నో: ఇటీవల 4లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ కేవలం రెండంటే రెండు స్థానాలను మాత్రమే దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో కైరానా సిట్టింగ్ స్థానంతో పాటు నుర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయింది.
Recommended Video

ఈ నేపథ్యంలో ఓటమికి కారణాలు వెతికే పనిలో పడ్డ ఆ పార్టీ.. ఓ విచిత్రమైన వాదనను ముందుంచింది. వేసవి సెలవులే తమ కొంపముంచాయని ఆ పార్టీ చెబుతోంది. పాడి పరిశ్రమల శాఖ మంత్రి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. 'పార్టీ మద్ధతుదారులు, కార్యకర్తలు, ఓటర్లు అంతా వేసవి సెలవుల కారణంగా కుటుంబాలతో సహా ఊళ్లకు వెళ్లారు. వారిని ఇబ్బంది పెట్టకూడదని అధిష్ఠానం భావించింది. ఒకవేళ వారంతా అందుబాటులో ఉండి ఉంటే కైరానా, నూర్‌పూర్‌లో బీజేపీ అవలీలగా గెలిచి ఉండేది' అని వ్యాఖ్యానించారు.

అయినా ఉపఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రానా వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఇదే కోణంలో చూడవద్దని ఆయన కోరుతున్నారు. ఉపఎన్నికల్లో ఓడిపోయినా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ ఓటమిపై ఆ పార్టీ హార్దోయి ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
పార్టీలో అంతర్గత కలహాల వల్లే బీజేపీ ఓటమిపాలైందని ఆయన పేర్కొన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ పై కూడా ఆయన పలు ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications