ఈ సీజన్ లో ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే ఉంటుందిరా చారీ..!

సమ్మర్ వచ్చేస్తోంది. వేసవిలో స్కూల్, కాలేజీలకు హాలీడేస్ ఇస్తారు. దాంతో ఇంటిల్లిపాదీ దూర ప్రాంతాలకు టూర్ కు వెళ్లాలని అనుకుంటారు. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను చూసి బోర్ కొట్టిందా..? కొత్తగా ఏమైనా ప్రదేశాలను చుట్టేయాలని ఉందా..? అయితే మీకు ఈ సీజన్ లో బెస్ట్ టూరిస్టు ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. ఇవి ఇతర రాష్ట్రాల్లో ఉన్నా ఈ వసంతకాలంలో ఈ పర్యటక ప్రదేశాలను సందర్శిస్తే ఆ మజాయే వేరు. మరి ఆ ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ప్రకృతిని ఆస్వాదించాలంటే జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ కు వెళ్లాల్సిందే.. శ్రీనగర్ లో పర్యాటకుల సందడి ముఖ్యంగా వేసవిలో అధికంగా ఉంటుంది. మండు వేసవిలో ఇక్కడ చాలా చల్లగా ఏదో కొత్త లోకంలో విహరించిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సీజన్ లో శ్రీనగర్ పర్యాటకులకు స్వర్గధామంలా మారుతుంది. శ్రీనగర్ లో దాల్ సరస్సుపై హౌజ్ బోట్ లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ శాలిమార్ బాగ్, నిషాత్ బాగ్, చష్మే షాహీ, పారి మహల్ తదితర పర్యాటక ప్రదేశాలు టూరిస్టులను ఆకట్టుకుంటాయి.

ఇక సిక్కింలోని యుమ్తాంగ్ లోయను సిక్కిం పూల లోయ అని పిలుస్తుంటారు. ఇక్కడి పూల తోటలు, షింగ్బా రోడోడెండ్రాన్ శాంక్చురీ టూరిస్టులను ఆకట్టుకుంటోంది. అలాగే లాచుంగ్ నది అందాలు అద్భుతంగా ఉంటాయి. సిక్కింలో మరో ప్రత్యేకత ఏంటంటే..? హాట్ స్ప్రింగ్స్.. దాంతో సిక్కింలో పర్యటించేందుకు టూరిస్టులు అధికంగా ఆసక్తి చూపిస్తుంటారు.

మరోవైపు బెంగాల్ లోని డార్జిలింగ్ ప్రాంతాన్ని 'క్వీన్ ఆఫ్ హిల్స్' అని పిలుస్తుంటారు. ఇక్కడ అనేక పర్యటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో టైగర్ హిల్, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్, డార్జిలింగ్ రోప్‌ వే ప్రసిద్ధి చెందాయి. అలాగే ఇక్కడి ప్రసిద్ధమైన ఘూమ్ మొనాస్టరీ పర్యటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇక టైగర్ హిల్ వద్ద సూర్యోదయాన్ని చూడడం మరచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

Summer Paradise Spots india states Srinagar J amp amp K Yumthang Sikkim Darjeeling Shillong Meghalaya

మేఘాలయాలోని షిల్లాంగ్ లో సందర్శించడం ఒక అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంది. ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. వేసవిలో ఇక్కడ విహరించేందుకు అనువైన ప్రదేశం అని చెప్పొచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఇది అనువైన సమయం. ఇక్కడ ఉమియం సరస్సు, షిల్లాంగ్ శిఖరం, ఎలిఫెంట్ ఫాల్స్ సందర్శించేందుకు అనువుగా ఉంటాయి. మీరు కూడా ఈ సమ్మర్ సీజన్ లో ఈ ప్రాంతాల్లో విహరించేందుకు ప్లాన్ చేసుకోండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+