ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.... సన్ టీవి సీఓఓని అరెస్టు చేసిన పోలీసులు
చెన్నై: మాజీ మహిళా ఉద్యోగినిని వేధింపులకు గురి చేసినందుకు గాను సన్ టీవి టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సి ప్రవీణ్‌ను శుక్రవారం ఉదయం చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అన్నానగర్‌లోని తన నివాసంలో ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే... గతంలో తాను సూర్య టీవిలో ప్రోగ్రామ్ ప్రొడ్యుసర్‌గా పనిచేసినప్పుడు సీఓఓ ప్రవీణ్ లైంగికంగా వేధించాడని ఓ యువతి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఐదు నెలల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసినా.. ఇంకా అతని వేధింపులు కొనసాగుతున్నాయని కంప్లైంట్ చేసింది.

ప్రవీణ్, ఆమెను ఏవిధంగా లైంగికంగా వేధించాడనే దానికి ఆధారంగా తన వాట్స్‌అప్ మేసేజ్‌లను, మాట్లాడిన మాటలను పోలీసులకు అందించింది. వాటి ఆధారంగా ప్రవీణ్ ను ప్రశ్నించిన సీసీబీ టీంఆయనను అదుపులోకి తీసుకుంది. ప్రాధమిక విచారణలో సీఓఓ ప్రవీణ్ మానసికంగా, శారీరకంగా వేధించాడని తెలుస్తోంది.
మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్ సోదరుడైన కళానిధి మారన్ నడుపుతున్న సన్ టెలివిజన్ నెట్‌వర్క్‌లో న్యూస్ ఎడిటర్ వి. రాజాపై 2013లో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications