సూపర్ సీఎంగా లాలూ ప్రసాద్!: కొడుకు శాఖల్లో వేలు

పాట్నా: ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సూపర్ సీఎంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం బీహార్‌ను ఏలిన లాలూ ప్రభ.. ఆ తర్వాత తగ్గింది. అయితే, ఇటీవల జెడియూతో కలిసి బీహార్‌లో పోటీ చేశారు.

అంతేకాదు, నితీష్ కుమార్ మంత్రివర్గంలో తన ఇద్దరు తనయులకు మంత్రి పదవులు ఇప్పించుకున్నారు. ఓ కొడుకుకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇప్పించుకున్నారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యేందుకు దోహదపడిన లాలూ... ఇప్పుడు బీహార్లో సూపర్ సిఎంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Super CM Lalu Prasad Yadav calls the shots in his son's office

నితీష్ కేబినెట్లో లాలూ చిన్న కొడుకు ఉప ముఖ్యమంత్రి కాగా, పెద్ద కుమారుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. అంతేకాదు, లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడి ఆధ్వర్యంలోని బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ వ్యవహారాల్లో ఆయన తల దూర్చారు.

ఇటీవల దర్బంగా మెడికల్ కళాశాల ఆసుపత్రిని సందర్శించిన లాలూ... అక్కడి వైద్యాధికారికి ఓ లేఖ అందించారు. ఆ లేఖలో ఏముందన్న విషయం నాడు బయటకు రాలేదు. అయితే, అందులోని అంశాన్ని ఆ వైద్యాధికారి తాజాగా బయట పెట్టారు.

విధుల నుంచి తీసేసిన నలుగురు మహిళా కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లాలూ ఆ లేఖలో వైద్యధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ లేఖపై విపక్షాలు మండిపడుతున్నాయి. పదవి లేకున్నా సూపర్ సీఎం, షాడో సీఎంగా లాలూ వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+