సూపర్ స్టార్ స్పెషల్, 2023 నాటికి ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?, ఒక్క సినిమాకు వందల కోట్లు !

డిసెంబర్ నెల అంటే సౌత్ ఇండియా సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ అభిమానులకు పండగే. డిసెంబర్ 12వ తేదీన తలైవా రజనీకాంత్ పుట్టినరోజు. అందుకే తమిళనాడుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజు వేడుకలు జోరుగా నిర్వహించారు. ఈసారి కూడా రజనీకాంత్ తన 73వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.

డిసెంబర్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రజనీకాంత్‌కు భారతదేశంలోనే కాకుండా జపాన్, మలేషియా, దక్షిణ కొరియా, అమెరికా, యూకే, దుబాయ్‌ తదితర దేశాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. జైలర్ మెగా హిట్ అయిన తర్వాత రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు కూడా చాలా జోరుగా జరిగాయి. తమిళనాడులో చిన్నా పెద్ద అని తేడా లేకుండా రజనీకాంత్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.

 Superstar Rajinikanth has assets of Rs 2023 crores and how many crores property tax has he paid

జైలర్‌ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్ వసూళ్లు పరంగా ఆయన స్టామినాను విపరీతంగా పెంచుకున్నారు. రజనీకాంత్ సినిమాల మార్కెట్ కు డిమాండ్ కూడా పెరిగిపోయింది. తలైవా రజనీకాంత్ పుట్టిన రోజు వేడుకలను తమిళనాడులోని ప్రతి జిల్లాలో, నగరాల్లో, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆయన అభిమానులు చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. తమిళనాడుతో పాటు దేశాల్లో రజనీకాంత్ ఫ్యాన్స్ సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

2023 సంవత్సరంలో రజనీకాంత్‌కు ఎంత ఆస్తి ఉంది, జైలర్ సినిమాకు రజనీకాంత్ ఎంత పారితోషికం తీసుకున్నాడు? ఎంత పన్ను చెల్లించారు? అనే సమాచారం బయటకు వచ్చింది సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్తిపై పలు మీడియా సంస్థలు అనేక కథనాలు ప్రచురించాయి. ఆసియాలో అత్యధిక పారితోషికం తీసుకునే రెండవ నటుడిగా కూడా రజనీకాంత్ రికార్డులకు ఎక్కారు.

రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా టైమ్స్ నౌ 2023 నాటికి రజనీకాంత్ ఆస్తుల విలువ 55 మిలియన్ డాలర్లు అని పేర్కొంది. అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్తుల విలువ దాదాపు రూ. 437 కోట్లు అని సమాచారం. రెండేళ్లుగా వరుస పరాజయాలతో షాక్‌కు గురైన సూపర్ స్టార్ రజనీకాంత్‌ జైలర్‌ సినిమాతో కలెక్షన్ల సునామీకి తెరలేపారు.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ 600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. జైరల్ సినిమా ద్వారా రజనీకాంత్ దాదాపు రూ. 110 కోట్ల రూపాయలు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ 2023లో కట్టిన ఆస్తి పన్నులు, సంపాదించిన ఆస్తులు, పెట్టుబడులు, కార్లు, ఇంటి ధర మొదలైనవన్నీ ఈ పుట్టినరోజున చాలా మీడియా సంస్థల ద్వారా వెలగులోకి వచ్చాయి.

 Superstar Rajinikanth has assets of Rs 2023 crores and how many crores property tax has he paid
రాజ్ భవన్ లో బాంబు పెట్టాము, ఆలస్యం చేస్తే మీకే నష్టం, కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి !

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి

* రజనీకాంత్ మొత్తం ఆస్తుల విలువ రూ. 437 కోట్లు (55 మిలియన్లు)

* రజనీకాంత్ ఆయన నటిస్తున్న సినిమాలకు సరాసరి రూ. 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు.

* రజనీకాంత్ వివిద రంగాల్లో రూ. 110 కోట్లు పెట్టుబడులు పెట్టారు.

* రజనీకాంత్ కు రూ. 2. 5 కోట్ల విలువ చేసే ఖరీదైన కారు కూడా ఉంది.

* రజనీకాంత్ ఇటీవల ఆదాయ పన్ను శాఖ అధికారులకు రూ. 13 కోట్లు చెల్లించారని రికార్డులు చెబుతున్నాయి.

* ఇటీవల విడుదల అయిన జైలర్ సినిమాకు రజనీకాంత్ రూ. 110 కోటు పారితోషికం తీసుకున్నారని సమాచారం.

సూపర్ స్టార్ రజనీకాంత్ నికర విలువల ఆస్తులను ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. పలు సమాచారం ఆదారంగా ఈ సమాచారాన్ని సేకరించి ఈ నివేదికను రూపొందించారు. అయితే దీనిని అధికారికంగా పరిగణించలేము. దక్షిణాదిన ప్రముఖ నటుల్లో రజనీకాంత్ ఒకరు. అలాగే దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో రజనీకాంత్ ఒకరు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. చెన్నైలో చాలా ఖరీదైన ప్రాంతమైన పోయెస్ గార్డెన్‌లో రజనీకాంత్ కు సుమారు రూ 50 నుండి రూ 60 కోట్ల విలువైన ఇల్లు ఉందని అంచనా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+