ఆర్ టీసీ ఉద్యోగులకు పిచ్చిఎక్కేలా చేసిన సూపర్ స్టార్, మనలో ఎవరు సీనియర్ !
బెంగళూరు/చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అందరికి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. జైలర్ సినిమా విడుదల తరువాత రజనీకాంత్ భారతదేశం మొత్తం తిరిగేస్తున్నారు. కర్ణాటకలో పుట్టి పెరిగి తమిళ సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా ఎదిగిన ప్రముఖ నటుడు రజనీకాంత్ బెంగళూరులోని జయనగర్‌లోని బీఎంటీసీ డిపోలో ఆకస్మికంగా ప్రత్యక్షం కావడంతో అక్కడి సిబ్బంది మతిపోయింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒక్కసారిగా చూసిన బీఎంటీసీ సిబ్బంది ఆయన్ను చూసేందుకు వెళ్లి సెల్ఫీలు దిగి సందడి చేశారు. మంగళవారం ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ బెంగళూరులోని జయనగర బీఎంటీసీ బస్ డీపోలో ప్రత్యక్షం అయ్యారు. తమిళ చిత్రసీమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న తలైవా రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం ఇటీవల విడుదలై సినీ అభిమానుల నుంచి ఊహించని ఆదరణ పొందింది.

బెంగళూరులో సిటీ బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే రజనీకాంత్ నాటకాల మీద మోజు పెంచుకున్నాడు. దీంతో ఆయన సౌత్ ఇండియా సూపర్‌స్టార్‌గా మారిపోయారు. బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీని సందర్శించిన రజనీకాంత్ కొద్దిసేపు అధికారులతో, బీఎంటీసీ డిపో ఉద్యోగులతో పిచ్చపాటిగా చర్చించారు. తాను కండక్టర్‌గా పనిచేసిన రోజులను, ఇదే బీఎంటీసీ బస్సులో తిరిగానని రజనీకాంత్ బీఎంటీసీ సిబ్బందికి చెప్పారు.
కండెక్టర్ ఉద్యోగం పూర్తి అయిన తరువాత ఇదే ప్రాంతాల్లోని థియేటర్‌లో సినిమాలు చూశానని, ఆ రోజుల్లో తాను బెంగుళూరు చుట్టానని, తరువాత సినిమాల్లోకి వెళ్లానని రజనీకాంత్ ఆయన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. బీఎంటీసీ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ ఫొటో దిగారు. రజనీకాంత్ హఠాత్తుగా బీఎంటీసీ బస్ డిపోలో ప్రత్యక్షం కావడంతో చాలా మందికి ఆశ్చర్యం కలిగించినా అది పచ్చి నిజయం అని ఆలస్యంగా తెలుసుకున్నారు.

బహుబాష నటుడు రజనీకాంత్ 72 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. తమిళ సినిమాల్లో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కన్నడ, తెలుగు, హిందీతో పాటు ఇతర బాషల్లో నటించిన ఆయనకు ఇతర బాషల నటులతో మంచి అనుభంధం ఉంది. తొలినాళ్లలో కన్నడ నటుడు విష్ణువర్ధన్‌తో సహోదర సవాల్ అనే సినిమాతో పాటు కొన్ని కన్నడ సినిమాల్లో రజనీకాంత్ నటించారు.
ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి పెదరాయుడు సినిమాలో నటించిన రజనీకాంత్ మోహన్ బాబు కెరీర్ మలుపు తిరగడానికి కారణం అయ్యారు. డాక్టర్ రాజ్ కుటుంబంతో రజనీకాంత్ కు విడదీయరాని అనుబంధం ఉంది. నటుడు రజనీకాంత్ డిసెంబర్ 12, 1950లో అప్పటి మైసూర్ రాష్ట్రం, ఇప్పుడు కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులో పుట్టి పెరిగారు.

రజనీకాంత్ అసలు శివాజీ రావ్ గైక్వాడ్, తరువాత శివాజీ రావ్ గైక్వాడ్ పేరు కాస్తా రజనీకాంత్‌గా మారింది. చదువు పూర్తి చేసుకున్న తరువాత బీఎంటీసీ బస్ కండక్టర్‌గా రజనీకాంత్ ఆయన వృత్తిని బెంగళూరులోనే ప్రారంభించారు. నాటకాలు, సినిమాల పిచ్చితో రజనీకాంత్ తరువాత అప్పటి మద్రాసుకు వెళ్లిపోయాడు. తరువాత దర్శకుడు బాలచందర్ కన్ను రజనీకాంత్ మీద పడింది.
బాలచందర్ 1975లో రజనీకాంత్‌ను వెండితెరకు పరిచయం చేశారు. తొలి సినిమా అపూర్వ రాగంగాళ తోనే కలర్‌ఫుల్ లైఫ్‌లోకి రజనీకాంత్ పేరుతో ఆయన అడుగుపెట్టాడు. ఆ తర్వాత సినీరంగంలో రజనీకాంత్ వెనుదిరిగి చూసుకోలేదు, ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సినిమా జైలర్ తో రజనీకాంత్ మరోసారి ఆయన సత్తా చాటుకున్నారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానుల మనసు దోచుకున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications