జీవిత ఖైదు తర్వాత మరో శిక్ష విధించవచ్చా ? ధర్మసందేహం తీర్చిన సుప్రీంకోర్టు

మన దేశంలో తీవ్ర నేరాల్లో విధిస్తున్న జీవిత ఖైదు తర్వాత మరో శిక్ష విధించే అవకాశం ఉంటుందా ? ఇప్పటివరకూ ఎవరో కొందరికి మాత్రమే వచ్చిన ఈ అనుమానం కర్నాటకలోని ఓ ట్రయల్ కోర్టుకు కూడా వచ్చింది. ఈ అంశాన్ని పరిశీంచిన కోర్టు.. జీవిత ఖైదు సక్రమంగా అనుభవించని ఓ ఖైదీకి మరోసారి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో సదరు బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

జీవిత ఖైదు తర్వాత మరో ఖైదు విధించే అంశంపై ఇమ్రాన్ జలాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ ను ఆయన తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్ద్ దవే వాదించారు. పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. జీవిత ఖైదు అనేది అతి పెద్ద శిక్ష అని దాని తర్వాత మరో శిక్ష విధించే అవకాశం లేదని దేశ అత్యున్నత న్యాయస్ధానం తీర్పు చెప్పింది.

supreme court key verdict on life sentence, quashes karnata trial court order

జీవిత ఖైదు అంటేనే చచ్చే వరకూ ఖైదు చేయడం అని, దాన్ని మించి మరో శిక్ష విధించడం ఎలా సాధ్యమని న్యాయమూర్తి జస్టిస్ లలిత్ ప్రశ్నించారు. కర్నాటక ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది.

ఓసారి దోషిగా తేలిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తే అతను తన జీవితకాలంలో చేసిన అన్ని నేరాలకు కలిపి అది వర్తిస్తుందని, అలాంటప్పుడు జీవిత ఖైదు తర్వాత మరో శిక్ష విధించడం ఏ విధంగానూ సబబు కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.ఓ వ్యక్తికి ఒకసారి మాత్రమే జీవించే హక్కు ఉన్నప్పుడు అతనికి జీవిత ఖైదు తర్వాత మరోసారి శిక్షించడం సమంజసం కాదని బాధితుడి తరఫు న్యాయవాది సిద్ధార్ద్ దవే చేసిన వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. కర్నాటక ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+