ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు: ఏపీ vs చిన్నయ్య కేసులో..

Supreme Court on SC, ST sub classification: ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో ఏర్పాటైన ఏడుమంది సభ్యుల ధర్మాసనం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల్లో మరింత వెనుకబడిన వారికి ప్రత్యేక కోటాలను మంజూరు చేయడంపై దాఖలైన పిటీషన్లపై విచారించడానికి ఏడుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ విక్రాంత్ నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది.

Supreme Court ruled sub classification within the SC ST is permissible

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల్లో మరింత వెనుకబడిన వారికి ప్రత్యేక కోటాలను మంజూరు చేయడానికి ధర్మాసనం అనుమతించింది. ఏడుమందిలో జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. మిగిలిన ఆరుమంది దీనికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

2004లో ఏపీ వర్సెస్ ఈవీ చిన్నయ్య కేసులో నమోదైన వాదనలను కొట్టివేస్తున్నట్లు సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఉప వర్గీకరణను అమలు చేసే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వందశాతం రిజర్వేషన్‌ను కేటాయించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే- ఉప వర్గీకరణ విషయంలో రాష్ట్రాలు తమ వద్ద ఉన్న డేటాను ఆధారంగా చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

ఎస్సీ, ఎస్టీలలో శతాబ్దాలుగా అణచివేతను ఎదుర్కొంటోన్న కొన్ని వర్గాలు ఉన్నాయని జస్టిస్ బీఆర్ గవై అభిప్రాయపడ్డారు. ఆయా వర్గాల్లో క్రీమీలేయర్‌ను గుర్తించి, వారికి సరైన రిజర్వేషన్లను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని అన్నారు.

మెజారిటీ సభ్యుల తీర్పును జస్టిస్ బేలా ఎం త్రివేది విభేదించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన ప్రయోజనాలను ఉప వర్గీకరించడానికి రాష్ట్రాలకు ఎటువంటి అర్హత లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రాల ద్వారా ఉప వర్గీకరణ అనేది ఆర్టికల్ 341 (2) ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్‌తో ముడిపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+