Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SBIకి సుప్రీంకోర్టు మళ్లీ చీవాట్లు-ఎన్నికల బాండ్ల నంబర్లేవీ..? వాటికి మరో డెడ్ లైన్..

రాజకీయ పార్టీలు విరాళాల సేకరణ కోసం విడుదల చేసిన ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించే విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. తాము గత విచారణలో ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశాలు ఇచ్చినా రాజకీయ పార్టీల వారీగా వచ్చిన విరాళాల వివరాలు బయటపెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఎస్బీఐ వైఖరిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇప్పటికే ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీల విరాళాల సేకరణ విధానాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు.. గత ఐదేళ్లలో ఇలా సేకరించిన విరాళాల పూర్తి వివరాలు వెల్లడించాలని ఎస్బీఐని ఆదేశించింది. కానీ స్టేట్ బ్యాంక్ మాత్రం ఎంపిక చేసిన వివరాలు మాత్రమే వెల్లడించి తప్పించుకోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సోమవారం లోగా ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు బయటపెట్టాల్సిందేనని స్టేట్ బ్యాంక్ ను ఆదేశించింది.

Supreme Court serious on SBI For Not Sharing full data of Electoral Bonds

ఎస్బీఐ ఇచ్చిన వివరాలతో ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఈ డేటా అసంపూర్ణంగా ఉందని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం, ఎస్బీఐ ఇప్పటికే వెల్లడించిన వివరాలతో పాటు ఎలక్టోరల్ బాండ్ నంబర్‌లను కూడా బయటపెట్టాలని ఆదేశించింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఎవరు హాజరవుతున్నారు? వారు బాండ్ నంబర్లను ఎందుకు వెల్లడించలేదు, ఇప్పటికైనా వాటిని వెల్లడించాలంటూ సీజేఐ చంద్రచూడ్ ఆదేశించారు.

ఎన్నికల బాండ్ల నంబర్లు ఇవ్వకుండా డేటా ఎలా ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల బాండ్ల నంబర్లు విడుదల చేస్తే ఏ రాజకీయ పార్టీకి ఎన్ని విరాళాలు వెళ్లాయో తెలుస్తుందని సీజే తెలిపారు. కాబట్టి మార్చి 18లోగా ఈ వివరాలను కూడా బయటపెట్టాలని సుప్రీంకోర్టు ఎస్బీఐకి పంపిన తాజా నోటీసులో ఆదేశించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+