బీజేపీ తొలి విజయం: సూరత్ ఎంపీగా ముఖేశ్ దలాల్ ఏకగ్రీవం, కాంగ్రెస్‌కు షాక్

సూరత్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అప్పుడే మొదటి విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ రాష్ట్రం​లోని సూరత్ లోక్‌​సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ముఖేశ్​ దలాల్ ఏకగ్రీవంగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ సమర్పించిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

నీలేశ్ కుంభానీ నామినేషన్ పత్రాలపై ప్రపోజర్లుగా సంతకాలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఏప్రిల్ 21న జిల్లా ఎన్నికల అధికారి ఎదుట హాజరయ్యేందుకు నిరాకరించారు. తాము ఆ పత్రాలపై సంతకాలు చేయలేదని వారు స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే ఈ స్థానం నుంచి నామినేషన్లు వేసిన అభ్యర్థులంతా పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

Surat Collector gives MP certificate to BJP s Mukesh Dalal after rejection of congress candidate s nomination

ఆ వెంటనే సూరత్ స్థానం నుంచి నామినేషన్లు వేసిన మిగతా 8 మంది అభ్యర్థులంతా పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించే బీఎస్పీ తరఫున నామినేషన్ వేసిన ప్యారేలాల్ భారతి కూడా పోటీ నుంచి వైదొలగడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ముందుజాగ్రత్త చర్యగా సురేశ్ పడసాల అనే వ్యక్తితో నామినేషన్ వేయించినప్పటికీ అది కూడా తిరస్కరణకు గురైంది. సరైన పత్రాలు లేకపోవడం వల్ల దాన్ని కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.

ఈ నాటకీయ పరిణామాల మధ్య ముఖేశ్​ దలాల్ సూరత్ నుంచి ఏకగ్రీవంగా లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా నేపథ్యంలో సూరత్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పార్లమెంట్ సభ్యత్వ పత్రాన్ని ముఖేష్ దలాల్‌కు అందించారు.

ఈ నేపథ్యంలో ముకేశ్​ దలాల్‌ను అభినందిస్తూ గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ చేతికి మొదటి విజయ కమలాన్ని అందించినందుకు ఆయనను అభినందించారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం.. సూరత్ స్థానానికి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ మాత్రమే అభ్యర్థులను నిలబెట్టాయి.


మరోవైపు, బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+