ట్విస్ట్: ఆ ఎస్సై అలా అనలేదు, ఆ రికార్డింగులూ అబద్ధమే, అంతా కుట్ర: తేల్చేసిన పోలీసులు

తనపై లైంగిక దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలంటే ముందు తన కోరిక తీర్చాలని వేధించాడని ఓ ఎస్సైపై ఫిర్యాదు చేసిన మహిళ కేసు కొత్త మలుపు తిరిగింది.

రామ్‌పూర్‌: తనపై లైంగిక దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలంటే ముందు తన కోరిక తీర్చాలని వేధించాడని ఓ ఎస్సైపై ఫిర్యాదు చేసిన మహిళ కేసు కొత్త మలుపు తిరిగింది.

అసలు ఆ ఎస్సై ఆ మాటలే అనలేదని, కావాలని ఆయనను ఇరికించేందుకు ఆమె తన బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసులు తేల్చేశారు. అంతేకాదు, వారిద్దరిని మోసం చేసిన కేసులో అరెస్టు చేసి జైలులో వేశారు.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అంతకుముందు ఆ ఎస్సై తనను వేధించినప్పుడు చేసిన రికార్డింగులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు కూడా పంపించకుండానే ఆమె బోయ్‌ఫ్రెండ్‌ మీదకు నెట్టేసి వారిని జైల్లో వేశారు.

చదవండి: డ్యాన్స్ నేర్పిస్తానని.. కొంప ముంచాడు

Survivor who accused cop of seeking sex to arrest rapists jailed in ‘cheating’ case

వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జనవరి నెలలో తనపై లైంగిక దాడి జరిగిందని, వారిని అరెస్టు చేసి జైలులో వేయాలంటూ బాధితురాలు రవీంద్ర ప్రతాప్‌ సింగ్‌ అనే ఎస్సైకి ఫిర్యాదు చేసింది.

అయితే, తాను నిందితులను అరెస్టు చేయాలంటే ముందు తన లైంగిక వాంఛను తీర్చాలని అతడు ఆమెను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని రికార్డింగులు కూడా బాధితురాలు ఎస్పీకి అందజేసింది.

అయితే, ఈ కేసును శర వేగంగా రెండు రోజుల్లో దర్యాప్తు చేసిన పోలీసులు అవి ఫేక్‌ రికార్డింగ్స్‌ అని, బాధితురాలు ఆ ఎస్సైపై కక్షతో అలా చేసిందని, ఆమె బోయ్‌ఫ్రెండ్‌ ఆ రికార్డింగులు తయారు చేశాడని తేల్చేశారు.

ఆ మహిళ ఏ ఫోన్‌లో అయితే, రికార్డు చేసినట్లు చెప్పిందో ఆ ఫోన్‌ను పరిశీలించగా ఆమె బోయ్‌ఫ్రెండ్‌ ఇదంతా చేసినట్లు తెలిసిందని చెప్పారు. దీనిపై ఎస్సై రవీంద్ర ప్రతాప్‌ సింగ్‌ స్పందిస్తూ తాను అసలు ఆమెతో అలాంటి మాటలు మాట్లాడలేదని, తన గదిలోకి రమ్మని ఎప్పుడూ చెప్పలేదని, వాళ్లిద్దరు తనపై ఇలా కట్టుకథ అల్లారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+