వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వామి నిత్యానందపై నిషేదం: మదురై ఆధీన మఠంలోకి నో ఎంట్రీ: మద్రాసు హైకోర్టు స్టే !

స్వామి నిత్యానందపై నిషేదం విధించాలని మద్రాసు హై కోర్టు మదురై బెంచ్ లో పిటిషన్ మదురై ఆధీన మఠంలో అడుగు పెట్టకుండా చూడాలని పిటిషన్ విచారణ వివరణ ఇవ్వాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, దేవాదాయ శాఖ, కలెక్టర్ కు

|
Google Oneindia TeluguNews

చెన్నై: వివాదాస్పద స్వామిజీ స్వామి నిత్యానంద మదురై ఆధీన మఠంలో అడుగు పెట్టకుండా మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించారు. స్వామి నిత్యానందను మదురై ఆధీన మఠంలో అడుగు పెట్టకుండా చూసే విషయంలో వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు దేవాదాయ శాఖ కమిషనర్, మదురై జిల్లా కలెక్టర్ కు నోటీసులు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

2,500 ఏళ్ల పురాతన చరిత్ర ఉన్న మదురై ఆధీన మఠం పరిపాలన విభాగంలో స్వామి నిత్యానంద, ఆయన అనుచరులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని కుట్రలు చెయ్యడానికి సిద్దం అయ్యారని, వారిని అడ్డుకోవాలని మదురై జైహింద్ పురానికి చెందిన జగదల ప్రతాపన్ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు.

Swami Nithyananda barred from entering Madurai Adheenam Mutt

మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ న్యాయమూర్తి మహదేవన్ సమక్షంలో పిటిషన్ విచారణకు వచ్చింది. మదురై ఆధీన మఠం 292వ మఠాధిపతిగా అరుణగిరి నాథర్ 25 ఏళ్లుగా ఉన్నారని, 2012లో నిత్యానంద చట్టవ్యతిరేకంగా తయారు చేసిన సర్టిఫికెట్ తో తాను 293వ మఠాధిపతిగా ప్రకటించుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.

తమిళనాడు ప్రభుత్వం నిత్యానంద నియమకాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. మఠంలోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని నిత్యానంద మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సైతం పిటిషన్ వేస్తే అందుకు కోర్టు అంగీకరించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.

కోర్టు ఆదేశాలను ధిక్కిరిస్తున్న నిత్యానంద, ఆయన అనుచరులు పోలీసుల భద్రతతో మదురై ఆధీన మఠంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిత్యానంద విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని మద్రాసు హై కోర్టు మదురై బెంచ్ ను ఆశ్రయించారు.

2010లో నిత్యానంద రాసలీల కేసులో చిక్కుకున్నాడని, అలాంటి వ్యక్తి ఎంతో చరిత్ర ఉన్న మదురై ఆధీనం మఠాధిపతిగా ఉండటానికి అవకాశం ఇవ్వరాదని కోర్టులో చెప్పారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి మహదేవన్ ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖ, మదురై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అంత వరకూ నిత్యానంద మదురై ఆధీన మఠంలో అడుగు పెట్టరాదని కోర్టు సూచించింది.

English summary
The Madras High Court on Wednesday banned controversial self-styled godman Swami Nithyananda from entering the 2500-year-old Saivite Madurai Adheenam mutt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X