Swamiji: ఏం జరిగిందో మొత్తం చెప్పండి స్వామీజీ, డీఎస్పీ ఆఫీసులో స్వామీజీ విచారణ, పిన్ టూ పిన్ చెప్పండి !
బెంగళూరు/చిత్రదుర్గ: క్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు ఇప్పటికే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు స్వామీజీని విచారణ చేస్తున్న పోలీసు అధికారులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. శనివారం డాక్టర్ శివమూర్తి మురుగా శరణరును విచారణ చేస్తున్న పోలీసు అధికారులు మ్యాటర్ మొత్తం బయటకు లాగుతున్నారని, పిన్ టూ పిన్ అడుగుతున్నారని సమాచారం.

లైంగిక వేదింపుల కేసు
చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు కర్ణాటకలో మంచి పేరుప్రతిష్టలు ఉన్నాయి. మురుగా మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థల్లో చదువుకుంటూ హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు మైనర్ అమ్మాయిలు శివమూర్తి మురగా శరణరు మామీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఇటీవల కేసు పెట్టారు.

స్వామీజీ అరెస్టుతో ?
మురుగా మఠానికి చెందిన అక్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రదుర్గకు చెందిన స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరును అరెస్టు చేసిన పోలీసులు చిత్రదుర్గా జిల్లా జైలుకు పంపించారు.

స్వామీజీ విచారణకు కోర్టు అనుమతి
విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన శివమూర్తి మురుగా శరణరు స్వామిజీ అరెస్టు కావడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరును సెప్టెంబర్ 5వ తేదీ వరకు పోలీసు కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

రెండో రోజు స్వామీజీ విచారణ
చిత్రదుర్గాలోని డీఎస్పీ కార్యాలయంలో శివమూర్తి మురుగా శరణరును పోలీసుల అధికారులు విచారణ చేస్తున్నారు, శుక్రవారం రాత్రి వరకు స్వామీజీ విచారణ చేసిన పోలీసులు అధికారులు శనివారం ఉదయం నుంచి మరోసారి విచారణ చేస్తున్నారు. డీఎస్పీ కార్యాలయం చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అనీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు స్వామీజీని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications