విజయ్ కాంత్ అభిమాన హీరో ఎవరో తెలుపా ?, విజయ్ కాంత్ కు కెప్టెన్ కాకుండా మరో పేరు ?
తమిళనాడులోని కోట్లాది మంది ప్రజలను కంటతడి పెట్టించారు కెప్టెన్ విజయకాంత్. తమిళనాడులోనే అదే కాదు క్యాప్టెన్ విజయ్‌కాంత్‌కు ప్రపంచం నలుమూలలా పలుదేశాల్లో అభిమానులు ఉన్నారు. తమ అభిమాన హీరో విజయ్ కాంత్ మరణవార్త విన్న అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విజయ్ కాంత్ ను ఆయన అభిమానులు గర్వంగా కెప్టెన్ అని పిలుస్తారు.
తమిళనాడులోని పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కూడా విజయ్ కాంత్ ను ముద్దుగా కెప్టెన్ అని పిలిచేవారు. విజయ్ కాంత్ తన విప్లవ స్వభావం కారణంగానే ప్రజాదరణ పొందారు. సినిమాల్లోనూ రెబల్ పాత్రల్లోనే విజయ్ కాంత్ ఎక్కువగా నటించాడు. మరోవైపు రాజకీయాల్లో రెబల్ గానే గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ ఆరాధ్యదైవం ఎంజీఆర్‌కి విజయ్ కాంత్ వీరాభిమాని. ఎంజీఆర్ సినిమాలు అంటే విజయ్ కాంత్ పడిచచ్చిపోయేవాడని ఆయన సన్నిహితులు చాలా సందర్బాల్లో చెప్పారు.

ఎంజీఆర్ లాగే సినిమాల్లో నటించి లీడ్ యాక్టర్‌గా తమిళ సినీ పరిశ్రమలో వెలగాలని విజయ్ కాంత్ చాలా కలలుకున్నాడు. విజయ్ కాంత్ కూడా అదే బాటలో నడిచి విజయం సాధించారు. విజయ్ కాంత్ కు కెప్టెన్ అనే పేరు కాకుండానే ఆయనకు మరో పవర్ ఫుల్ బిరుదు (టైటిల్) కూడా ఉంది. విజయ్ కాంత్ ను పురట్చి కలైంగర్ అని పిలుస్తారు. పురట్చి కలైంగర్ అంటే విప్లవ కళాకారుడు అని అర్థం.
విజయ్ కాంత్‌కి ఈ బిరుదు ఎవరు పెట్టారో తెలిస్తే అందూ ఆశ్చర్యపోతారు. విజయ్ కాంత్ ను చా దగ్గర నుంచి ఆయన మనోభావాలు గుర్తించి ఆ హీరో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్న వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్. విజయ్ కాంత్ నటించే విప్లవాత్మక పాత్రలు, ఆయన కళాత్మకతను రెండింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్. థాను ఈ టైటిల్ పెట్టారు.
నిర్మాత కలైపులి ఎస్. థాను మరో తమిళ అగ్రనటుడికి అలాంటి మరిచిపోలేని బిరుదు ఇచ్చాడు. ఆ నటుడు ఎవరో కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్. రజనీకాంత్‌కి సూపర్‌స్టార్ అనే బిరుదును మొదట అందించింది కూడా నిర్మాత కలైపులి ఎస్. థానున. కలైపులి ఎస్ థాను ఆయన నిర్మిస్తున్న సినిమాలో హీరో అయిన రజనీకాంత్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ అని టైటిల్ కార్డ్ వేశారు.
విజయకాంత్‌కి పురట్చి కలైంగర్ (విప్లవ కళాకారుడు) అనే బిరుదు కూడా తానే ఇచ్చానని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను ఓ పాత ఇంటర్వ్యూలో వివరించారు. విజయకాంత్, నిర్మాత కలైపులి ఎస్. థాను చాలా ఏళ్లుగా స్నేహితులు. విజయ్ కాంత్ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండేది. విజయ్ కాంత్ నటించిన అనేక సినిమాలో తెలుగులో కూడా విడుదలై సంచలన విజయాలు సాధించాయి.

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్ కే రోజా భర్త ఆర్ కే సెల్వమణి దర్శకత్వంలో విజయ్ కాంత్ నటించిన కెప్టెన్ ప్రభాకర్ సినిమా 1991లో తమిళ, తెలుగు బాషాల్లో విడుదలై సంచలన విజయం సాధించింది. కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో మంత్రి రోజా భర్త ఆర్ కే సెల్వమణి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. సినిమా, రాజకీయ రంగాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని తమిళనాడులో కోట్లాది మంది అభిమానులను సంపాధించుకున్న కెప్టెన్ విజయకాంత్ ఇక లేరు అనే విషయాన్ని తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications