Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Actress: హీరోయిన్ ఎఫెక్ట్, హైకోర్టులో నో బెయిల్, అండర్ గ్రౌండ్ లో మాజీ మంత్రి, ఎంతపని జరిగింది !

చెన్నై/మదురై: తమిళనాడు మాజీ మంత్రి మణికందన్, హీరోయిన్ చాందిని లవ్ స్టోరీ రసవత్తరంగా మారింది. చాందిని కేసులో తప్పించుకుని తిరుగుతున్న మాజీ మంత్రిని అరెస్టు చెయ్యాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో మాజీ మంత్రి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. మాజీ మంత్రిని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు అనేక ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మాజీ మంత్రి, హీరోయిన్ సంసారం చేసినట్లు ఎక్కడా సాక్షాలు లేవని, ఆమెకు ఇంతకు ముందు అబార్షన్లు కాలేదని మాజీ మంత్రి న్యాయవాదులు అంటున్నారు. మా దగ్గర అన్ని సాక్షాలు ఉన్నాయి, పోలీసులకు ఇచ్చామని చాందిని లాయర్లు వాదిస్తున్నారు. మాజీ మంత్రి, హీరోయిన్ లవ్ స్టోరీలో కచ్చితంగా పొలిటికల్ లీడర్ అరెస్టు అవుతాడని తమిళనాడు ప్రజలు కోడైకూస్తున్నారు. చాందిని దెబ్బతో ఎంతపని అయ్యింది అని మాజీ మంత్రి అనుచరులు అంటున్నారు.

 అసలే మలేషియా అమ్మాయి

అసలే మలేషియా అమ్మాయి

మలేషియాకు చెందిన నటి చాందిని నోమాడ్స్ తో పాటు అనేక తమిళ సినిమాల్లో నటించింది. తమిళ సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న తనను అప్పట్లో మంత్రి పదవిలో ఉన్న మణికందన్ తనతో పరిచయం పెంచుకున్నాడని నటి చాందిని ఆరోపిస్తున్నది. తరువాత అన్నాడీఎంకే నాయకుడు మణికందన్ తనతో చనువుగా ఉండేవాడని నటి చాందిని అంటోంది.

 స్వర్గం చూశాడు..... నన్నే మోసం చేశాడు

స్వర్గం చూశాడు..... నన్నే మోసం చేశాడు

నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మాజీ మంత్రి మణికందన్ తనతో చెన్నైలోని శాస్త్రీనగర్ లో రహస్యంగా కాపురం పెట్టాడని, ఇద్దరూ కలిసి ఐదు సంవత్సరాలు కాపురం చేశామని నటి చాందని ఆరోపిస్తోంది. ఇటీవల వరకు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, భార్య హోదాలో నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని మాజీ మంత్రి మణికందన్ తనకు తియ్యటి మాటలు చెప్పాడని, తనతో స్వర్గం చూసిన తరువాత తననే మోసం చేశాడని చాందిని ఆరోపించింది.

 మూడుసార్లు అబార్షన్ చేపించిన మాజీ మంత్రి ఫ్రెండ్ ?

మూడుసార్లు అబార్షన్ చేపించిన మాజీ మంత్రి ఫ్రెండ్ ?

తన భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత నిన్ను అందరి ముందు రెండో పెళ్లి చేసుకుంటానని, ఇప్పుడే పెళ్లి చేసుకుంటే రాజకీయంగా కొన్ని ఇబ్బందులు వస్తాయని మణికందన్ ఇంతకాలం తనకు మాయమాటలు చెప్పాడని చాందిని ఆరోపిస్తున్నది. ఇలా మాయమాటలు చెప్పిన మణికందన్ తనకు ఇప్పటి వరకు మూడు సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని నటి చాందిని ఆరోపిస్తున్నది. మాజీ మంత్రి మణికందన్ కు స్నేహితుడైన డాక్టర్ తనకు అబార్షన్ చేశాడని, తాను ఆసుపత్రికి వెళ్లినట్లు తన దగ్గర సాక్షాలు ఉన్నాయని నటి చాందిని అంటోంది.

 నగ్న వీడియోలు.... చంపేస్తాడని భయం

నగ్న వీడియోలు.... చంపేస్తాడని భయం

నన్ను పెళ్లి చేసుకోనని చెప్పిన మణికందన్ కు తాను ఎదురు తిరిగానని తనను చంపేస్తానని కిరాయి రౌడీలతో బెదరిస్తున్నాడని నటి చాందిని ఆరోపిస్తోంది. నువ్వు పోలీసు కేసు పెడితే ఇంతకాలం రహస్యంగా బెడ్ రూమ్ లో, బాత్ రూమ్ లో తీసుకున్న నీ అశ్లీల వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని మణికందన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నటి చాందిని చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

 ఆ రోజు పరారైన మాజీ మంత్రి

ఆ రోజు పరారైన మాజీ మంత్రి

నటి చాందిని వెనుక పెద్దపెద్ద వ్యక్తులు ఉన్నారని, మూడు కోట్ల రూపాయలు ఇవ్వకుంటే మీ మీద కేసులు పెడుతామని నన్ను బ్లాక్ మెయిల్ చేశారని, డబ్బులు ఇవ్వలేదని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఇటీవల మణికందన్ ఆరోపించారు. చాందిని కేసు పెట్టిన తరువాత మాజీ మంత్రి మణికందన్ మాయం అయిపోయాడు. అప్పటి నుంచి మణికందన్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.

 హైకోర్టుకు మాజీ మంత్రి...... నో బెయిల్

హైకోర్టుకు మాజీ మంత్రి...... నో బెయిల్

చాందని కేసులో మాజీ మంత్రి మణికందన్ ముందస్తు బెయిల్ కోసం చెన్నై హైకోర్టును ఆశ్రయించాడు. చెన్నై హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ జరిగింది. మాజీ మంత్రి మణికందన్, హీరోయిన్ చాందిని సంసారం చేసినట్లు ఎక్కడా సాక్షాలు లేవని, ఆమెకు ఇంతకు ముందు అబార్షన్లు కాలేదని, మాజీ మంత్రి మణికందన్ కు బెయిల్ ఇవ్వాలని ఆయన న్యాయవాదులు కోర్టుకు మనవి చేశారు. మణికందన్, చాందిని కలిసి తిరిగారని, కాపురం చేశారని మా దగ్గర అన్ని సాక్షాలు ఉన్నాయి, పోలీసులకు ఇచ్చామని, అతనికి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని, బెయిల్ ఇవ్వకూడదని చాందిని లాయర్లు కోర్టులో మనవి చేశారు. కేసు విచారణలో ఉందని, మణికందన్ కు బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కూడా కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న చెన్నై హైకోర్టు మణికందన్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

Recommended Video

    Actress Sanjana Galrani Distributing Daily Food to Poor people during lockdown | Oneindia Telugu
     అండర్ గ్రౌండ్ లో దాక్కొన్న లీడర్ ?

    అండర్ గ్రౌండ్ లో దాక్కొన్న లీడర్ ?

    చెన్నై హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో హడలిపోయిన మణికందన్ పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారని సమాచారం. చెన్నై మొత్తం గాలించినా మణికందన్ ఆచూకి చిక్కలేదని పోలీసులు అంటున్నారు. మదురై జిల్లాలో మణికందన్ తలదాచుకున్నాడని సమాచారం అందడంతో చెన్నై పోలీసులు అక్కడికి వెళ్లారు. శనివారం లేదా ఆదివారం కచ్చితంగా మణికందన్ ను అదుపులోకి తీసుకుంటామని చెన్నై పోలీసులు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+