Udayanidhi Stalin: డిప్యూటీ సీఎం ఉదయనిధి ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!!
Udayanidhi stalin:తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. మూడో తరం లీడర్లు ఇటు పార్టీకి అటు ప్రభుత్వంలో కొత్త ఊపిరి పోస్తున్నారు. సీఎన్ అన్నాదురై ప్రారంభించిన పార్టీ ఆయన తదనంతరం కరుణానిధి పార్టీని విజయవంతంగా నడపారు. కరుణానిధి కాలం చేశాక పార్టీని ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పగ్గాలు చేపట్టారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూక్తిని స్టాలిన్ ఫాలో అవుతున్నట్లున్నారు. ప్రస్తుతం ఆయన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇచ్చారు. ఇక స్టాలిన్ హీరో నుంచి డిప్యూటీ సీఎంగా ఎదిగారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ఆస్తులు ఎంత అనేది చాలా మంది ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు.
డీఎంకే మాజీ నేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, క్రీడలు, యువజన సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు.1977 నవంబర్ 27న చెన్నైలో జన్మించారు. డాన్ పాస్కో స్కూల్‌లో తన చదువును పూర్తి చేసిన ఉదయనిధి స్టాలిన్, 1997లో చెన్నైలోని లయోలా కాలేజీలో తన బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ కోర్సును పూర్తి చేశాడు. ఆ తర్వాత 2002లో కృతికను వివాహమాడారు. 2008లో ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఈ బ్యానర్‌లో పలు చిత్రాలను నిర్మించారు.2012లో ఒరు కల్ ఒరు కన్నాడీ సినిమాతో కోలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఈచిత్రానికి బెస్ట్ మేల్ డెబ్యూ కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుపొందారు. ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నటించిన చివరి చిత్రం మామన్నన్. ఇది 2023 సంవత్సరంలో విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించింది.

ఉదయనిధి రాజకీయ ప్రయాణం:
2019 జూలైలో డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా ఉదయనిధి స్టాలిన్ నియమితులయ్యారు.2019 లోక్‌సభ ఎన్నికల కోసం డీఎంకే తరపున ప్రచారం చేశారు.2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై చేపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 14 డిసెంబర్ 2022న తమిళనాడులో క్రీడలు మరియు యువజన సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిగా ఎన్నికయ్యారు.ఇక సెప్టెంబర్ 29వ తేదీన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఉదయనిధి ఆస్తులు:
46 ఏళ్ల ఉదయనిధి స్టాలిన్ ఆస్తులు రూ.33 కోట్లుగా ఉన్నాయి. ఇక వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో రూ.1.22 కోట్లు ఉండగా, రూ.7.72 కోట్లు విలువైన బాండ్లు స్టాక్‌లు ఆయన పేరుమీదున్నాయి.రూ.16లక్షల విలువైన బీమా పాలసీలు ఉండగా..రూ.11 కోట్లు వివిధ బ్యాంకులకు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా పొందారు.అతని వద్ద 1600 గ్రాముల బంగారం ఉండగా... దీని ధర సుమారు రూ.55 లక్షలుగా ఉంటుంది. వీటి మొత్తం విలువ రూ.22.53 కోట్లు.

ఉదయనిధికి విలాసవంతమైన కార్లు
ఉదయనిధి పేరుపై విలాసవంతమైన కార్లు వ్యవసాయ భూమి కూడా ఉంది. వ్యవసాయ భూమి విలువ రూ.4.73 కోట్లు ఉండగా, ఖాళీ స్థలం విలువ రూ.88 లక్షలుగా ఉంది.ఆయన పేరుపై రూ.92.6 లక్షలు విలువ చేసే నివాస భవనం ఉంది.అతరి దగ్గరున్న రేంజ్ రోవర్ కారు విలువ రూ. 1.77 కోట్లు.ఇదిలా ఉండగా, 2013లో ఉదయనిధి స్టాలిన్ అక్రమంగా హమ్మర్ కారును దిగుమతి చేసుకుని కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి హైదరాబాద్ వ్యాపారి దిగుమతి చేసుకుని ప్రభావవంతమైన వ్యక్తులకు విక్రయించినట్లు చెప్పబడుతున్న అనేక లగ్జరీ వాహనాల్లో ఈ కారు ఒకటి. ఉదయనిధి పై ఇప్పటి వరకు 22 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.
మొత్తానికి ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అక్కడ డీఎంకే నేతల్లో జోష్ కనిపిస్తోంది. పార్టీ పగ్గాలు కూడా ఈ యువనాయకుడు త్వరలోనే చేపట్టే అవకాశాలున్నాయంటూ డీఎంకేలో చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ తన తాత కరుణానిధిని, తండ్రి స్టాలిన్‌ను మైమరిపించే పాలనను అందిస్తారని డీఎంకే పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో ఈ యువనేత అభివృద్ధిని ఉరకలు పెట్టిస్తారని వారు జోస్యం చెబుతున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications