నటితో అక్రమ సంబంధం, రెచ్చిపోయిన మాజీ ప్రియుడు, రాత్రి చెల్లెలుకు సెగ, ఫ్యామిలీతో కలిసి ఫినిష్!

చెన్నై: వివాహం అయిన బుల్లితెర నటిని అక్రమ సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేసిన ఆమె మాజీ ప్రియుడు దారుణంగా హత్యకు గురైనాడు. మాజీ ప్రియుడి హత్య కేసులో బుల్లితెర నటితో పాటు ఆమె భర్త, చెల్లెలు, ఆమె భర్తను తమిళనాడు రాజధాని చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కొనసాగించాలని తనతో పాటు తన కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చెయ్యడం వలనే తాము హత్య చెయ్యవలసి వచ్చిందని బుల్లితెర నటి చెబుతోందని చెన్నై సిటీ పోలీసులు అంటున్నారు.

బుల్లితెర నటి

బుల్లితెర నటి

దేవి అనే మహిళ తమిళ బుల్లితెర నటి. బుల్లితెర నటి దేవికి శంకర్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. చెన్నైలోని వడపళనిలో చాల సంవత్సరాల నుంచి దేవి, శంకర్ దంపతులు నివాసం ఉంటున్నారు. అనేక టీవీ సీరియల్స్ లో, కొన్ని తమిళ యాడ్స్ లో దేవి నటించింది.

అక్రమ సంబంధం

అక్రమ సంబంధం

మధురైకి చెందిన రవి (37) అనే వ్యక్తి సినిమాల్లో నటించాలని ఆసక్తితో చెన్నై చేరుకున్నాడు. తరువాత చెన్నైలోని సాలిగ్రామంలో రవి నివాసం ఉంటున్నాడు. ఇదే సమయంలో బుల్లితెర నటి దేవితో రవికి పరిచయం అయ్యింది. తనకు నటించడానికి దేవి అవకాశాలు ఇప్పిస్తుందని ఆమెతో చనువుగా ఉండేవాడు. ఇదే సమయంలో దేవి, రవిల చనువు అక్రమ సంబంధానికి దారితీసింది.

నటికి మొగుడు వార్నింగ్

నటికి మొగుడు వార్నింగ్

రవి, దేవి విచ్చలవిడిగా తిరుగుతున్న విషయం ఆమె భర్త శంకర్ కు తెలిసింది. పద్దతి మార్చుకోవాలని, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని శంకర్ భార్య దేవిని హెచ్చరించాడు. రవి కారణంగా ఎక్కడ తన కాపురంలో కలతలు వస్తాయో ?, ఎందుకు అతని వల్ల తనకు లేనిపోని సమస్యలు అని ఆలోచించిన దేవి ప్రియుడు రవికి దూరం కావాలని నిర్ణయించింది.

భర్తతో బుల్లితెర నటి ఎస్కేప్

భర్తతో బుల్లితెర నటి ఎస్కేప్

రవి నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం అని ఆలోచించిన దేవి కొంతకాలం క్రితం భర్త శంకర్ తో కలిసి వడపళనిలోని ఇల్లు ఖాళీ చేసి కొలత్తూర్ సెమాత్తమన్ కోవిల్ వీధిలోని కొత్త ఇంటికి మారిపోయింది. తరువాత దేవి ఆమె మొబైల్ ఫోన్ నెంబర్ మార్చివేసి రవికి కనపడకుండా, అతనికి అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరిగింది.

నటి చెల్లెలు అడ్రస్ చిక్కింది

నటి చెల్లెలు అడ్రస్ చిక్కింది

తన ప్రియురాలు దేవి కోసం ఎక్కడెక్కడో గాలించిన రవికి చివరికి ఆమె చెల్లెలు లక్ష్మి ఇంటి అడ్రస్ చిక్కింది. ఆదివారం రాత్రి పీకలదాక మద్యం సేవించిన రవి మాజీ ప్రియురాలు దేవి చెల్లెలు లక్ష్మి ఇంటికి వెళ్లి మీ అక్క అడ్రస్ చెప్పాలని, కనీసం ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగాడు. దేవి ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ తనకు తెలీదని లక్ష్మి రవికి చెప్పింది. అయితే మాట వినని రవి నువ్వు మీ అక్క దేవి అడ్రస్ చెప్పకుంటే ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తేలేదని అక్కడే మకాం వేశాడు.

మర్యాదగా వెళ్లిపో, లేదంటే ?

మర్యాదగా వెళ్లిపో, లేదంటే ?

రవి గొడవ ఎక్కువ కావడంతో లక్ష్మి ఆమె అక్క దేవికి ఫోన్ చేసి విషయం చెప్పింది. రాత్రి దేవి, ఆమె భర్త శంకర్ కలిసి లక్ష్మి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, నీతో మాట్లాడటం తనకు ఇష్టం లేదని దేవి మాజీ ప్రియుడు రవికి చెప్పింది. అయితే మద్యం మత్తులో ఉన్న రవి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి నిరాకరించాడు.

మాజీ ప్రియుడిని చంపేసిన నటి

మాజీ ప్రియుడిని చంపేసిన నటి

రవి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి నిరాకరించి రచ్చ రచ్చ చెయ్యడంతో కోపం తట్టుకోలేక సహనం కోల్పోయిన దేవి ఇనుప రాడ్ తీసుకుని మాజీ ప్రియుడు రవి తల మీద దాడి చేసింది. అదే సమయంలో దేవి భర్త శంకర్ సైతం పెద్ద కర్ర, రాడ్ తీసుకుని రవి మీద దాడి చేశాడు. దేవి చెల్లెలు లక్ష్మి, ఆమె భర్త పావరీస్ కూడా రవి మీద దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైన రవి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కేసు నమోదు చేసిన కీల్ పాక్కమ్ పోలీసులు దేవి, ఆమె భర్త శంకర్, లక్ష్మి, ఆమె భర్త పావరీస్ ను అరెస్టు చేశారు. తనతో అక్రమ సంబంధం కొనసాగించాలని లైంగికంగా వేధింపులకు గురి చెయ్యడం వలనే హత్య చేశామని దేవి చెబుతోందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+