సీఎం గూటిలో స్లీపర్ సెల్స్ ఎమ్మెల్యేలు ఎవరు ? ఇంటలిజెన్స్ వేట, పళని, పన్నీర్ అలర్ట్ !
సీఎం పళనిసామి వర్గంలోని స్లీపర్ సెల్స్ ఎమ్మెల్యేలు ఎవరు ? ఎమ్మెల్యేల మీద నిఘా వేసిన ఇంటలిజెన్స్ అధికారులు, డేగ కన్ను దినకరన్ నేరుగా హెచ్చరించడంతో అలర్ట్ అయిన సీఎం పళని, పన్నీర్ సెల్వం
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ గుట్టుచప్పుడు కాకుండా దినకరన్ వైపు మొగ్గు చూపుతున్న స్లీపర్ సెల్స్ ఎమ్మెల్యేలు ఎవరు ? అంటూ తమిళనాడు ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రతిఒక్క ఎమ్మెల్యే మీద అధికారులు నిఘా వేశారు.
రెండు రోజుల క్రితం టీటీవీ దినకరన్ మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి రాజీనామా చెయ్యాలని, ఎప్పుడైన మీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న స్లీపర్ సెల్స్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చే అవకాశం ఉందని మీడియా ముందే సీఎంను నేరుగా హెచ్చరించారు.

ఈ సందర్బంలో ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం అలర్ట్ అయ్యారు. మనకు మద్దతు ఇస్తూ ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు మొత్తం టీటీవీ దినకరన్ కు చేరవేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు ? అనే విషయం తెలుసుకోవాలని పళని, పన్నీర్ నిర్ణయించారు.
తమిళనాడు ఇంటలిజెన్స్ అధికారులను పిలిపించిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి స్లీపర్ సెల్స్ ఎమ్మెల్యేలు ? ఎంత మంది ఉన్నారు ? దినకరన్ ను కలుస్తున్నారా ? రహస్యంగా చర్చలు జరుపుతున్నారా ? అంటూ పూర్తి వివరాలు సేకరించి ఇవ్వాలని సూచించారని తెలిసింది.












Click it and Unblock the Notifications