Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తార లవ్ జిహాదీ కేసు: పెద్దలకు కోహ్లీ అమ్మాయిల సప్ల్లై

రాంచీ: షూటర్ సహదేవ్ లవ్ జిహాద్ కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. తాను పెద్దలకు అమ్మాయిలను సరఫరా చేసేవాడినని తార సహదేవ్ భర్త రంజీత్ కుమార్ కోహ్ల అలియాస్ రకిబుల్ హుస్సేన్ జార్ఖండ్ పోలీసులకు చెప్పినట్లు శనివారం వార్తాకథనాలు వచ్చాయి. దర్యాప్తులో అతను ఆ విషయాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.

పెద్ద పెద్ద కస్టమర్లు అమ్మాయిలో గడపడానికి రాంచీలోని హోటల్ గదిని, బహుళ అంతస్థులోని రెండు ఫ్లాట్స్‌ను ఎల్లవేళలా బుక్ చేసి ఉంచినట్లు అతను పోలీసులకు చెప్పాడని అంటున్నారు. సర్కార్ అనే వ్యక్తితో హుస్సేన్ ఎప్పటికీ మాట్లాడుతుండేవాడని తార తన ఫిర్యాదులో చెప్పింది.

Tara Shahdeo case: Rakibul Hussain reveals Jharkhand Police 'supplied girls to bigwigs'

సర్కార్ అసలు పేరు రోహిత్ అని, సేవలు అందించినందుకు రకిబుల్ ఖాతాలోకి అతను డబ్బులు బదిలీ చేసేవాడని అంటున్నారు. ఇదిలావుంటే, కేసును సిబిఐకి అప్పగించాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ నిర్ణయించుకున్నారు.

తారా సహదేవ్ జాతీయ క్రీడాకారిణి అని, ఆమెకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఆమెతో భేటీ తర్వాత చెప్పారు. ఈ కేసులో రాష్ట్ర పోలీసులు తీసుకున్న చర్యల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల్లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగలిగారని ఆయన అన్నారు. నిందితుడిపై పోలీసులు అత్యాచారం కింద కేసు నమోదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+