‘విలన్’ఉదయ్ మృతి: నిర్మాత సుందర్ అరెస్టు

బెంగళూరు: శ్యాండిల్ వుడ్ సినిమా మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో తిప్పగుండనహళ్ళి జలాశయంలో గల్లంతు అయిన ఇద్దరు ప్రతినాయకుల్లో ఒకరైన ఉదయ్ రాఘవ్ అలియాస్ ఉదయ్ భౌతికకాయాన్ని మంగళవారం రాత్రి చెరువులో నుంచి బయటకు తీశారు.

మరో నటుడు, నిర్మాత అనీల్ కోసం బుధవారం తిప్పగుండనహళ్ళి జలాశయంలో గాలిస్తున్నారు. గజఈతగాళ్లు, జాతీయ విపత్తు సహాయక దళం అనీల్ కోసం గాలిస్తున్నారు. చిత్రీకరణ సమయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపిస్తూ మాస్తిగుడి సినిమా యూటిట్ సభ్యుల మీద కేసు నమోదు చేశారు.

నిర్మాతను వల వేసి పట్టుకున్న పోలీసులు

దునియా విజయ్ హీరోగా నిర్మిస్తున్న మాస్తిగుడి సినిమా నిర్మాత సుందర్.పి. గౌడను మంగళవారం రాత్రి తావరకెరె పోలీసులు అరెస్టు చేశారు. ప్రతినాయకులు అనీల్, ఉదయ్ మరణానికి కారణం అయ్యారని ఆరోపిస్తూ మాస్తిగుడి సినిమా యూనిట్ సభ్యుల మీద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Tavarekere police arrested Mastigudi Film Producer Sundar P Gowda

ఈ కేసులో ఎ-1 అరోపి అయిన నిర్మాత సుందర్.పి. గౌడను అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిర్మాత సుందర్ .పి.గౌడను 14 రోజుల పాటు రామనగర జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు.

విలన్ కు ముందు బీడాలు వేస్తూ సిక్స్ ప్యాక్ చేసి, నిర్మాతగా

అనీల్, ఉదయ్ చావుకు కారణం అయ్యారని నిర్మాత సుందర్.పి.గౌడ, దర్శకుడు నాగశేఖర్, సహాయ దర్శకుడు సిద్దు, ఫైట్ మాస్టర్ రవివర్మ, యూనిట్ మేనేజర్ భరత్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమా హీరో దునియా విజయ్ మీద క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+