TCS layoffs: త్వరలో 80 వేల లేఆఫ్స్..? టీసీఎస్ క్లారిటీ ఇదే..!
ఈ ఏడాది టెక్ ఉద్యోగుల లేఆఫ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో టెక్ కంపెనీలు 20 వేలకు పైగా ఉద్యోగాల కోతల్ని చేపట్టాయి. దీంతో లేఆఫ్ పేరెత్తితేనే ఉద్యోగులు బెంబేలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏఐ, ఆటోమేషన్ కారణాలను చూపుతూ ఉద్యోగుల్ని కంపెనీలు సాగనంపుతున్న తీరు ఇండస్ట్రీలో ఆందోళన కలిగిస్తోంది. ఇందులో భారతీయ టెక్ దిగ్గజం టీసీఎస్ కూడా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 12 వేల మంది ఉద్యోగుల్ని టీసీఎస్ సాగనంపిన తీరు కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో టీసీఎస్ లో మరోసారి లేఆఫ్స్ ప్రకటన ఉంటుందన్న చర్చ టాక్ ఆఫ్ ది ఇండస్త్రీగా మారింది. టీసీఎస్ ఈసారి సుమారు 80 వేల ఉద్యోగుల్ని లేఆఫ్ చేయబోతోందన్న వార్తలు ఐటీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్ నుంచి తొలగించిన ఉద్యోగులు సోషల్ మీడియాలో పంచుకుంటున్న బాధల్ని చూస్తుంటే తాజా ఊహాగానాలకు బలం చేకూరుతోంది. దీంతో లేఆఫ్స్ పై ఉద్యోగులు ఇప్పటికే అన్ని విధాలుగా ఆరా తీస్తున్నారు.

రెండు రోజుల క్రితం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్న తన కాలేజ్ ఫ్రెండ్ చెప్పాడంటూ ఓ ఎక్స్ యూజర్ భారతదేశంలో టీసీఎస్ 80,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు వెల్లడించాడు. జూలైలో 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో ఈ ట్వీట్ వైరల్ అయింది. దీంతో టీసీఎస్ తో పాటు ఇతర టెక్ కంపెనీల ఉద్యోగుల్లోనూ భయం మొదలైంది.
సదరు ట్వీట్‌లో తాజా లేఆఫ్స్ లో చాలా మంది ఉద్యోగులకు 18 నెలల పాటు సెవరెన్స్ ప్యాకేజీ ఇచ్చారని, మరికొందరికి మూడు నెలల వరకు టెర్మినేషన్ జీతం ఇచ్చారని తెలిపాడు. కొంతమంది దురదృష్టకర ఉద్యోగులకు ఎటువంటి పరిహారం కూడా దొరకలేదన్నాడు. ఈ నేపథ్యంలో టీసీఎస్ అధికారికంగానే స్పందించింది. భారత్ లో తమ కంపెనీలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నారనే పుకార్లను టీఎసీఎస్ అధికారికంగా తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications