TCS Layoffs: రిజైన్ చేయమంటే నో అన్నా..! వాళ్లే టార్గెట్- టీసీఎస్ ఉద్యోగి షాకింగ్..!
ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో తాజాగా చేపట్టిన ఉద్యోగాల కోతలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇలా ఉద్యోగాల కోతల సందర్భంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ అనుభవాల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు అంతకు మించి చర్చనీయాంశమవుతోంది. ఇదే క్రమంలో తాజాగా ఓ టీసీఎస్ ఉద్యోగి తనతో బలవంతంగా రాజీనామా చేయించాలని చూస్తే తాను నిరాకరించినట్లు రెడ్డిట్ లో పెట్టిన పోస్టులో పేర్కొన్నాడు.
ఒక మీటింగ్ రూమ్‌లో తనను రాజీనామా చేయమని అడిగి మూడు రోజులు అయ్యిందని, తాను దానికి నిరాకరించానని సదరు ఉద్యోగి తెలిపాడు. తాను ఏడుస్తూ, భయపడ్డానని, కానీ టీసీఎస్ తన మొదటి కంపెనీ అని తెలిపాడు. తాను కోల్పోయేది ఏమీ లేదన్నాడు. తొలగింపు తర్వాత వారు తనపై చెడుగా రివ్యూ ఇస్తానని బెదిరించారన్నాడు. మీకు నచ్చినట్లు చేయండి, కానీ తాను రాజీనామా చేయనని చెప్పేసి ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయానన్నాడు. తాను భయపడ్డానని, కానీ బలంగా ఉండటానికి ప్రయత్నించానని రెడ్డిట్ పోస్టులో పేర్కొన్నాడు.

టీసీఎస్ లో ముందుగా బెంచ్ పై ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని సదరు ఉద్యోగి వివరించాడు. తాను సీనియర్ ఉద్యోగిని కాదని, తన పేరు లేఆఫ్స్ జాబితాలో లేదని, కానీ వీళ్లు బెంచ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపాడు. ఎందుకంటే వారు ఈజీ టార్గెట్లు అన్నాడు. ఏ ప్రాజెక్ట్ తమను చూడకుండా లేదా కేటాయింపు కోసం కాల్ చేయకుండా వారు తమ ప్రొఫైల్‌లను బ్లాక్ చేస్తున్నారని తెలిపాడు. తాము తమ పరిచయాల ద్వారా ప్రాజెక్టులను తెలుసుకున్నా.. ఆర్ఎంజీ ఆ ప్రాజెక్టులకు కాల్ చేసి తమ కేటాయింపును రద్దు చేస్తుందన్నాడు.
ఆ తర్వాత ఏమి చేయాలో తనకు తెలియదని, తాను ప్రవాహంతో ముందుకు వెళ్తున్నానని సదరు ఉద్యోగి తెలిపాడు. తన శాఖలో, చాలా మంది రాజీనామా చేయడానికి నిరాకరించారని తెలిపాడు. హెచ్ఆర్ వారిని ప్రతిరోజూ మీటింగ్స్ కు పిలుస్తుందని, రాజీనామా చేయమని అడుగుతుందని, జీతాలను బ్లాక్ చేయడం, వారిని బ్లాక్‌లిస్ట్ చేయడం, చెడుగా ఫీడ్ బ్యాక్ ఇవ్వడం, వారిని ఎవరూ నియమించుకోరని చెప్పడం చేస్తుందన్నాడు. కానీ ఆ ఉద్యోగులు ప్రతిఘటిస్తూనే ఉన్నారన్నాడు.
10 రోజులుగా వారు ఈ పోరాటం చేస్తున్నారన్నాడు.

ఇది మానసిక వేధింపు, హింసేనన్నాడు. చాలా తక్కువ జీతంతో కూడా తాను టీసీఎస్ లో పని సంస్కృతి, ఉద్యోగ భద్రత కోసం చేరానని, ఇప్పుడు చింతిస్తున్నానని తెలిపాడు. తాను వేరే కంపెనీని ఎంచుకోవాల్సిందన్నాడు. రతన్ టాటా తర్వాత ఈ కంపెనీ పూర్తిగా మారిపోయిందన్నాడు. ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించమని హెచ్ ఆర్ విభాగాల వేధింపులు , మానసిక ఒత్తిడి ఆందోళనకరమన్నాడు. ఉద్యోగుల తొలగింపుపై ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి లేనందున ఇదో బాధాకరమైన అనుభవంగా మారుతుందన్నాడు.
Desclaimer: ఉద్యోగి రెడ్డిట్ పోస్ట్ లో షేర్ చేసిన అభిప్రాయాలు మాత్రమే ఇస్తున్నాం. ఇందులో అతని అభిప్రాయాలతో వన్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదు.












Click it and Unblock the Notifications