TCS Layoffs: ఉద్యోగులకు టీసీఎస్ మరో షాక్..! తాజా లేఆఫ్స్ ఇలా..!
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు వరుస షాక్ లు ఇస్తోంది. ఇప్పటికే గత ఆరునెలల్లో 30 వేల మందిని తొలగించిన టీసీఎస్.. కొత్త ఏడాదిలోనూ లేఆఫ్స్ పై ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఈ ఏడాది అయినా తమ ఉద్యోగాలు సేఫ్ అని భావిస్తున్న వారికి షాక్ తప్పడం లేదు. తాజాగా ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో నష్టాలు చవిచూసిన టీసీఎస్ తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది.
గతేడాది అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీసీఎస్ భారత్ లోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పెరుగుతున్న ఏఐ వినియోగం కారణంగా ఉద్యోగుల లేఆఫ్స్ ను ప్రకటిస్తూ వచ్చింది. వాటిని ఇప్పుడు కొత్త ఏడాదిలోనూ కొనసాగించాలని టీసీఎస్ నిర్ణయించింది. వ్యాపార అవసరాలను బట్టి ఈ ఏడాది లేఆఫ్స్ ఉంటాయని ఇవాళ టీసీఎస్ ప్రకటించింది. ఇవాళ మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో గతేడాది చేపట్టిన పునర్ నిర్మాణ ప్రక్రియ ఈ ఏడాది కూడా కొనసాగుతుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఏడాది ఎంతమంది ఉద్యోగుల్ని తొలగించాలన్న దానిపై మాత్రం నిర్దిష్ట లక్ష్యమేదీ లేదని, కానీ వ్యాపార ప్రయోజనాలు, డిమాండ్ ఆధారంగా ఈ లేఆఫ్స్ ఉంటాయని మాత్రం క్లారిటీ ఇచ్చాయి. ఇప్పటికే ఉద్యోగుల సంఖ్య తగ్గడం, ఆఫీసులో హాజరు నియమాలు కఠినతరం కావడం, అసెస్ మెంట్ ఆలస్యం కారణంగా చాలా మంది టీసీఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటనలు వచ్చాయి.












Click it and Unblock the Notifications