TCS: మహిళా ఉద్యోగులపై రేప్, వేధింపులు, మతమార్పిడులు-లీడ్స్ అరెస్ట్..!
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (tCS)కు చెందిన పలువురు మహిళా ఉద్యోగులు.. తమ టీమ్ లీడర్లు ఆఫీసులోనే తమపై లైంగిక వేధింపులకు, మతమార్పిడికి ప్రయత్నించారని చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మూడేళ్లుగా తమను రేప్ లు చేశారని, లైంగికంగా వేధిస్తున్నారని వారు చేసిన ఆరోపణలపై రంగలోకి దిగిన పోలీసులు పలువురు టీమ్ లీడ్స్ ను అరెస్టు చేశారు. దీంతో మహారాష్ట్రలోని నాసిక్‌లో తీవ్ర కలకలం రేగుతోంది.
18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు 2022 నుంచి మొదలై రెండు, మూడేళ్ల పాటు తమపై ఇలా వేధింపులు జరిగాయని ఆరోపించారు. నిందితులలో చాలామంది టీమ్ లీడర్లు ఇంజనీర్లు కాగా పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. మిగిలిన వారిపై విచారణ జరుగుతోంది. అరెస్టైన వారిలో ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్ , తౌసిఫ్ అత్తర్ ఉన్నారు. మరో ఉద్యోగి అశ్విన్ చైనాణిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

నలుగురు నుంచి ఐదుగురు ముస్లిం కంపెనీ ఉద్యోగులు, అధికారులు ఉద్యోగాలు, మంచి జీతాలు ఇప్పిస్తామని ఆశ చూపి అమ్మాయిలను ప్రలోభపెట్టారని మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ తెలిపారు. ఆ మహిళలతో "నమాజ్ చేయించి, రోజా పాటించేలా చేశారన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు ఏసీబీ స్థాయి అధికారి నేతృత్వంలో 12 మంది పోలీసులతో సిట్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఘటనలపై స్పందించిన టీసీఎస్ .. తాము జీరో-టాలరెన్స్ పాలసీని పాటిస్తామని తెలిపింది. విచారణలో ఉన్న ఉద్యోగుల్ని సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది.

నాసిక్‌లోని డియోలాలి పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం, వేధింపులు, వేధింపుల ఆరోపణలపై ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. నాసిక్ జిల్లాలోని ముంబై నాకా పోలీస్ స్టేషన్‌లో 8 వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కంపెనీలోని ఐదుగురు వ్యక్తులు మత మార్పిడి వాతావరణాన్ని సృష్టించారని, ఇది కార్యాలయంలో ఉద్రిక్తత, ఘర్షణలకు దారితీసిందని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. ఎనిమిది మంది మహిళా బాధితులు వేర్వేరు పని ప్రదేశాలలో తమను శారీరకంగా వేధించారని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేశారు. వారి శరీరాకృతి, దుస్తుల గురించి వ్యాఖ్యలు చేయడంతో పాటు, వారి మతపరమైన మనోభావాలను దెబ్బతీసే మాటల్ని వారు ఎదుర్కొన్నారు. సదరు టీమ్ లీడ్స్ మహిళలను వారి వైవాహిక సమస్యలను ఆసరాగా చేసుకుని లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. బాధితులు గతంలో హెచ్ ఆర్ ను సంప్రదించినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications