డిన్నర్ ఓవర్!: ఎన్నికల కోసం 'టీ విత్ కేజ్రీవాల్'కు రూ.20వేలు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి టీ తాగాలనుకునే వారు రూ.20వేలు ఇవ్వాలి! కేజ్రీవాల్‌తో లంచ్, డిన్నర్ పేరిట ఆ పార్టీ చందాలు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేజ్రీవాల్‌తో టీ తాగితే డబ్బులు వసూలు చేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో పార్టీ ఖర్చుల కోసం నిధుల సేకరణను ఆ పార్టీ ప్రారంభించింది. ఉందులో భాగంగా 'టీ విత్ కేజ్రీవాల్' అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. వచ్చే శనివారం జరిగే ఈ టీ కార్యక్రమానికి హాజరయ్యే వారు ఇరవై వేల రూ పాయలు చెల్లించవలసి ఉంటుందని ఆ పార్టీ నేత సోమనాథ్ భారతి తెలిపారు.

'Tea with Arvind Kejriwal' at Rs 20,000

ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిధుల కోసం మాజీ కేంద్రమంత్రి అయిన సోమనాథ్ భారతి దీనిని నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే కేజ్రీవాల్ ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో డిన్నర్ చేసి ఫండ్స్ వసూలు చేశారు. గతంలో డిన్నర్ విత్ కేజ్రీవాల్ కార్యక్రమం ద్వారా ఏఏపీ రూ.91 లక్షలు కలెక్ట్ చేసింది. కాగా, సోమనాథ్ భారతి సోషల్ మీడియాలోను అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీకి ఫండ్ ఇవ్వాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+