స్కూల్లోనే టీచర్ రాసలీలలు పట్టుకొన్న గ్రామస్థులు
జాజ్ పూర్ :విద్యాబుద్దులు చెప్పి విధ్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఒఓ టీచర్ తానే తప్పుడు మార్గంలో పయనిస్తున్నాడు. తన తప్పుడు మార్గాలకు పాఠశాలనే వేదికగా చేసుకొన్నాడు. పాఠశాలలోనే రాసలీలలు నడుపుతున్న టీచర్ ను స్థానికులు పట్టుకొన్న ఘటన చందాపూర్ లో చోటుచేసుకొంది.
ఒడిశా రాష్ట్రంలోని జాజ్ పూర్ జిల్లా రసూల్ పూర్ బ్లాక్ లోని చందాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో కామకేళీలు నిర్వహిస్తోన్న ఓ ఉర్ధూ టీచర్ ను గ్రామస్థులు పట్టుకొన్నారు. నసీమ్ ఖాన్ అనే ఉర్ధూ టీచర్ పాఠశాల ఆవరణలోనే ఓ మహిళతో అసభ్యకరరీతిలో ఉన్నాడు.

పాఠశాల ఆవరణలోనే అసభ్యకర పనులు చేస్తోన్న నసీమ్ ఖాన్ ఉదంతాన్ని గుర్తించిన స్థానికులు అతణ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు.ఈ విషయాన్ని విధ్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫాఠశాల ఊరికి దూరంగా ఉంటుంది. దీంతో పాఠశాల ఆవరణలోనే ఆయన నివాసం ఉంటున్నాడు. అయితే అక్కడే తాను అసభ్యకరపనులకు దిగుతున్నాడు.
గ్రామస్థుల ఫిర్యాదుతో బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రపుల్లకుమార్ ఈ ఘటనపై విచారణ జరిపారు. పాఠశాలలోనే అసభ్యకరమైన పనులను చేస్తోన్న ఉర్ధూ టీచర్ నసీమ్ ఖాన్ ను విధుల నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకొన్నట్టు బిడిఓ ప్రకటించారు.విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లే ఈ రకంగా వ్యవహారించడం సరికాదంటున్నారు స్థానికులు.












Click it and Unblock the Notifications