Lady teacher: భర్త పేరు, దుబాయ్ ప్రియుడి పేరు ఒక్కటే, మేడమ్ బర్త్ డే, డెత్ డే కూడా సేమ్, ప్లాన్ బి !
లేడీ టీచర్ హత్య కేసులో ఆమె దుబాయ్ బాయ్ ఫ్రెండ్ పేరు తెర మీదకు వచ్చింది. మాజీ భర్త, బాయ్ ఫ్రెండ్ పేర్లు ఒక్కటే కావడంతో తికమక అయ్యింది. అయితే మేడమ్ బర్త్ డే, డెత్ డే కూడా ఒకే రోజు కావడంతో అందరూ షాక్ అయ్యారు.
బెంగళూరు/దుబాయ్: కుమార్తె పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. చాలా సంవత్సరాల నుంచి దంపతుల గొడవలు పడుతున్నారు. అందంగా ఉన్న భార్య మీద ఆమె భర్తకు అనుమానం ఎక్కువ అయ్యింది. ఇదే విషయంలో గొడవపడిన దంపతులు విడిపోయారు. కూతురితో కలిసి తల్లి వేరుగా ఉంటున్నది. టీచర్ గా పని చేస్తున్న మహిళ కూతుర్ని పోషిస్తున్నది. ఇంట్లో ఉన్న మహిళ హత్యకు గురైయ్యింది. భర్త ఆమెను చంపేసి సైలెంట్ గా ఎస్కేప్ అయ్యాడని పోలీసులు, బంధువులు అందరూ అనుకున్నారు. అయితే లేడీ టీచర్ దుబాయ్ బాయ్ ఫ్రెండ్ పేరు తెర మీదకు వచ్చింది. మాజీ భర్త, బాయ్ ఫ్రెండ్ పేర్లు ఒక్కటే కావడంతో అక్కడ మొత్తం తికమక అయ్యింది. అయితే మేడమ్ బర్త్ డే, డెత్ డే కూడా ఒకే రోజు కావడంతో అందరూ షాక్ అయ్యారు.

కూతురు పుట్టిన తరువాత లేడీ టీచర్ ?
బెంగళూరుకు చెందిన కౌసర్ ముబీన్ (35) అనే మహిళ కొన్నాళ్ల క్రితం నదీమ్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తరువాత నదీమ్, కౌసర్ ముబీన్ చాలా సంతోషంగా కాపురం చేశారు. కౌసర్, నదీమ్ దంపతులకు ఓ కుమార్తె ఉంది. వ్యాపారం చేస్తున్న నదీమ్ అతని భార్య కౌసర్, కూతురిని బాగానే చూసుకునేవాడు. కూతురు పుట్టిన కొన్ని సంవత్సరాలకు దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

లేడీ టీచర్ మీద డౌట్
కౌసర్ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. అందంగా ఉన్న భార్య కౌసర్ మీద ఆమె భర్త నదీమ్ కు అనుమానం ఎక్కువ అయ్యింది. స్కూల్ కు వెలుతున్న తన భార్య కౌసర్ ఓ ప్రియుడిని సెట్ చేసుకుందని నదీమ్ రగిలిపోయాడు. ఇదే విషయంలో గొడవపడిన నదీమ్, కౌసర్ దంపతులు విడిపోయారు. బెంగళూరులోని శాంతినగర్ సమీపంలోని నంజప్ప సర్కిల్ సమీపంలోని ఓ ఇంట్లో కౌసర్ ముబీనా ఆమె కుమార్తెతో కలిసి నివసిస్తోంది.

నదీమ్ నదీమ్ అని కేకలు వేసింది
సోమవారం కౌసర్ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆసమయంలో అక్కడికి వెళ్లిన నదీమ్ అతని మాజీ భార్యతో గొడవ పడ్డాడు. కొంత సేపటి తరువాత మాజీ భర్త నదీమ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదే రోజు కౌసర్ ఇంట్లోనే దారుణ హత్యకు గురైయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కౌసర్ గట్టిగా నదీమ్ నదీమ్ అని కేకలు వేసిందని స్థానికులు పోలీసులకు చెప్పారు. కౌసర్ మాజీ భర్త పేరు నదీమ్ కావడంతో అతనే ఆమెను హత్య చేశాడని అనుకున్నారు.

దుబాయ్ బాయ్ ఫ్రెండ్
దుబాయ్ లో కొన్ని సంవత్సరాలు పని చేసిన నదీమ్ అనే వ్యక్తి బెంగళూరు చేరుకుని నివాసం ఉంటున్నాడు. రెండు సంత్సరాల నుంచి దుబాయ్ నదీమ్, కౌసర్ కు పరిచయం ఉంది. దానికితోడు ఇద్దరూ అక్రమ సంబందం పెట్టుకున్నారు. భర్తను వదిలేసి దూరంగా ఉంటున్న కౌసర్ ఇంటికి దుబాయ్ ప్రియుడు నదీమ్ వెళ్లి వస్తున్నాడు.

మేడమ్ భర్త పేరు, ప్రియుడి పేరు ఒక్కటే
కౌసర్ మాజీ భర్త పేరు నదీమ్, లేడీ టీచర్ కౌసర్ ప్రియుడి పేరు నదీమ్. మాజీ భర్త, ప్రియుడి పేర్లు నదీమ్ కావడంతో మొదట కౌసర్ ను ఎవరు హత్య చేశారు అని పోలీసులు తికమకపడ్డారు. భర్త నదీమ్ కు విడాకులు ఇచ్చిన కౌసర్ ఆమె ప్రియుడు నదీమ్ ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. కూతురు ఉన్న నువ్వు మరో పెళ్లి చేసుకోవడానికి వీలులేదని కౌసర్ కు ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

మేడమ్ బర్త్ డే రోజే ఆమె డెత్ డే
నిజానికి సోమవారం కౌసర్ బర్త్ డే. నీ బర్త్ డేకి నేను మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పిన దుబాయ్ ప్రియుడు నదీమ్ ఆమెను ఇంటి దగ్గరే ఉండాలని చెప్పాడు. తరువాత తనను ఎందుకు పెళ్లిచేసుకోవు అని గొడవ పెట్టుకున్న నదీమ్ కత్తి తీసుకుని ఆమె గొంతు కోసి దారుణంగా చంపేశాడని పోలీసులు అన్నారు. లేడీ టీచర్ కౌసర్ ఆమె బర్త్ డే రోజే హత్యకు గురి కావడం కలకలం రేపింది.

బాయ్ ఫ్రెండ్ జంప్
లేడీ టీచర్ కౌసర్ హత్య కేసులో హంతకుడు ఆమె మాజీ భర్త నదీమ్ కాదని, దుబాయ్ ప్రియుడు నదీమ్ అని అశోక్ నగర్ పోలీసులు తెలిపారు. భర్త పేరు, ప్రియుడి పేరు ఒక్కటే కావడంతో కౌసర్ హత్య కేసులో మొదట కొంచెం తికమక అయ్యిందని పోలీసులు తెలిపారు. లేడీ టీచర్ కౌసర్ ను హత్య చేసిన ఆమె దుబాయ్ బాయ్ ఫ్రెండ్ నదీమ్ ఎస్కేప్ అయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications