ముద్దుకు రూ. 50 వేలు, చాట్ డిలీట్ చేస్తే రూ. 50 లక్షలు ..లేడీ టీచర్ బంపర్ ఆఫర్

చదువు చెప్పాల్సిన టీచర్ దారి చెప్పింది. తన దగ్గర చదువుకుంటున్న స్టూడెంట్ తండ్రితో అసాంఘిక కార్యకలాపాలు చేయడం మొదలు పెట్టింది. అతని దగ్గర నుంచి భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేసింది. డబ్బుపై వ్యామోహంతో నగ్న వీడియోలు చూపించి స్టూడెంట్ తండ్రిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. చివరకు ఖిలాడి టీచర్ టార్చర్ భరించలేక సదరు స్టూడెంట్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది. స్టూడెంట్ తండ్రి దగ్గర నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.

గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి బెంగళూరులో వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ఈ వ్యాపారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. తన 5 ఏళ్ల కూతురిని స్కూల్‌లో చేర్పించే సమయంలో అక్కడి టీచర్‌ శ్రీదేవితో పరిచయం ఏర్పడింది. అప్పుడే అతని దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్న టీచర్ ప్రతిరోజు అతనికి ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూండేది. ఇది కాస్తా అసాంఘిక కార్యకలాపాలకు దారి తీసింది. టీచర్ శ్రీదేవి తన స్టూడెంట్ తండ్రికి న్యూడ్ వీడియో కాల్స్, మెసేజ్‌లు చేసేది.

Teacher threatens student s father with private videos

ఖిలాడి టీచర్ మాయలో పడ్డ స్టూడెంట్ తండ్రి సైతం ఆమె చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఇదింతా ముందుగానే పక్కా ప్లాన్‌ చేసుకుని రికార్డు చేసి అతన్ని బెదిరించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఓ రోజు తనకు రూ.4 లక్షలు కావాలని శ్రీదేవి అతడిని డిమాండ్ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు రూ.15 లక్షలు ఇవ్వకపోతే నువ్వు నాతో జరిపిన చాటింగ్,వీడియో కాల్స్ అన్నీ నీ భార్యకు చూపిస్తా అని అతడిని బ్లాక్ మెయిల్ చేసింది. శ్రీదేవితో పాటు ఆమె ఫ్రెండ్స్ గణేష్ కాలే,సాగర్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా అతడిని బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు దిగారు. వాళ్లు చెప్పినట్టు చేస్తూ వచ్చాడు స్టూడెంట్ తండ్రి.

అయితే ఇదే సమయంలో వ్యాపారంలో నష్టం రావడంతో స్టూడెంట్ తండ్రి బెంగళూరు నుంచి గుజరాత్‌కు మకాంకు మార్చాలని ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న టీచర్‌ శ్రీదేవి అతన్ని మరింతగా బెదిరించడం మొదలుపెట్టింది. రూ.20 లక్షలు చెల్లించకపోతే ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసింది.దీంతో ఆ వ్యాపారి చివరికి రూ.15 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ముందుగా 1.9 లక్షలు శ్రీదేవి అకౌంట్‌కి ట్రాన్స్ ఫర్ చేశాడు. శ్రీదేవి మళ్లీ మళ్లీ అతడికి ఫోన్ చేసి డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టింది. దీంతో టీచర్ శ్రీదేవి టార్చర్ భరించలేని స్టూడెంట్ తండ్రి నేరుగా పోలీసులకు జరిగింది చెప్పాడు. దీంతో కామ టీచర్ బండారం బయటపడింది. అతను ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీదేవి,ఆమె ఇద్దరి ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేశారు. వారికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+