వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించాడని.. నగ్నంగా ఊరేగించారు

ముంబై: ఇతర కులానికి చెందిన యువతిని ప్రేమించినందుకు ఓ యువకుడ్ని నగ్నంగా ఊరేగించిన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో చోటు చేసుకుంది. అహ్మద్‌నగర్ జిల్లా వాంభోరీ గ్రామవాసి అయిన బ్రాహ్మణ యువకుడు అదే గ్రామం మాలీ సామాజిక వర్గానికి చెందిన యువతితో అనుబంధం పెంచుకున్నాడు.

ఆమె వద్ద అతడి మొబైల్ ఫోన్ లభించడంతో వారిమధ్య అనుబంధం బయటపడింది. ఇది నచ్చని యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు.. అతడిని చితకబాదడంతోపాటు చెప్పుల దండవేసి నగ్నంగా ఊరేగించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Teen Paraded Naked for Affair With Girl From Different Caste in Ahmednagar

ఘటన సమాచారం తెలిసిన వెంటనే గ్రామానికి వెళ్లిన సీనియర్ పోలీసు అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. నిందితులపై బెదిరింపులు, నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదుచేశారు.

మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించిన వీడియో ఫుటేజ్‌ల ఆధారంగా యువతి కుటుంబ సభ్యులతోపాటు 17 మందిని అరెస్ట్‌చేశారు. వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మరో ఎనిమిది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+