తేజ్‌పాల్‌కు తాత్కాలిక బెయిల్, కాలం కలిసి రాలేదు

తేజ్‌పాల్ తల్లి చనిపోవడంతో ఆమె అంత్యక్రియలు తదనంతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి సుప్రీం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బిఎస్ చౌహాన్, జస్టిస్ ఎకె సిక్రీతో కూడిన ధర్మాసనం తరుణ్ బెయిల్ పిటిషన్‌ను పరిశీలించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
తల్లి అంత్యక్రియలకు చేరుకోలేకపోయిన తరుణ్
అత్యాచార ఆరోపణలతో అరెస్టై జైలులో ఉంటున్న తరుణ్ తేజ్‌పాల్ సోమవారం దైన్య పరిస్థితి ఎదుర్కొన్నారు. తేజ్‌పాల్ తల్లి 87 ఏళ్ల శకుంతలా తేజ్‌పాల్ ఆదివారం ఉత్తర గోవాలోని మెయిరా గ్రామంలో మరణించారు.
తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ ఆయన సమయానికి చేరుకోలేకపోయారు. తేజ్‌పాల్ శ్మశాన వాటికకు చేరుకునేసరికి సాయంత్రం ఏడు గంటలు దాటింది. అప్పటికే ఆరు గంటలకు ఆయన సోదరుడు చితికి నిప్పు అంటించారు.












Click it and Unblock the Notifications