బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Terrorist: ఐటీ హబ్ లో మరో ఉగ్రవాది అరెస్టు, లష్కర్ తోయిబాతో లింక్ ?, అక్తర్ రూమ్ లో ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా నివాసం ఉంటున్న అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేసి 24 గంటలు కూడా పూర్తి కాకుండా మరో అనుమానిత ఉగ్రవాది అరెస్టు కావడం కలకలం రేపింది. అక్తర్ హుస్సేన్ లష్కర్ అనే ఉగ్రవాదిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. అసోంకు చెందిన అక్తర్ హుస్సేన్ లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థతో లింక్ పెట్టుకున్నాడనిపోలీసుల విచారణలో వెలుగు చూసింది. సోషల్ మీడియా ద్వారానే అమాయకులైన యువకులు అక్తర్ టార్గెట్ చేసుకున్నాడని పోలీసులు అన్నారు. అక్తర్ హుస్సేన్ ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్న అతని స్నేహితుడిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Sadist: భార్యను గొలుసుతో కట్టేసి వ్యాపారి ఏం చేశాడంటే ?, బీర్ బాటిల్ తో ప్రైవేట్ పార్ట్స్ లో ? !Sadist: భార్యను గొలుసుతో కట్టేసి వ్యాపారి ఏం చేశాడంటే ?, బీర్ బాటిల్ తో ప్రైవేట్ పార్ట్స్ లో ? !

 తిలక్ నగర్ లో !

తిలక్ నగర్ లో !

బెంగళూరు నగరంలోని తిలక్ నగర్ లో అక్తర్ హుస్సేన్ లష్కర్ అలియాస్ అక్తర్ అలియాస్ హుస్సేన్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అక్తర్ హుస్సేన్ లష్కర్ అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నాడని సమాచారం అందండంతో సోమవారం వేకువ జామున బెంగళూరు సీసీబీ పోలీసులు అతని ఇంటి మీద దాడి చేసి అరెస్టు చేశారు.

 యువకులు టార్గెట్

యువకులు టార్గెట్

అక్తర్ హుస్సేన్ లష్కర్ అనే ఉగ్రవాదిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. అసోంకు చెందిన అక్తర్ హుస్సేన్ లష్కర్ అనే అనుమానిత ఉగ్రవాది బెంగళూరులోని తిలక్ నగర్ లో మకాం వేసి కొందరు యువకులకు బ్రేన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు. ఫేస్ బుక్, టెలిగ్రామ్, మెసేంజర్ తో పాటు పలు సోషల్ మీడియా ద్వారా అకౌంట్ ల ద్వారా అమాయకులైన యువకులు అక్తర్ టార్గెట్ చేసుకున్నాడని పోలీసులు అన్నారు.

 అక్తర్ రూమ్ లో ఉంటున్న యవకుడు

అక్తర్ రూమ్ లో ఉంటున్న యవకుడు

తిలక్ నగర్ లోని అద్దె ఇంటిలో అక్తర్ పాటు నివాసం ఉంటున్న మరో యువకుడిని పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అక్తర్ హుస్సేన్ ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్న అతని స్నేహితుడిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అక్తర్ హుస్సేన్ రూమ్ లో ఉన్న మరో యువకుడి పేరు కూడా అక్తర్ అని పోలీసు అధికారులు అంటున్నారు.

 పోలీసు కస్టడీకి అక్తర్

పోలీసు కస్టడీకి అక్తర్

తిలక్ నగర్ లో అరెస్టు అయిన లష్కర్ హుస్సేన్ లష్కర్ ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని కోర్టు ముందు హాజరుపరిచారు. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో అక్తర్ హుస్సేన్ కు సంబంధాలు ఉన్నాయని, అతన్ని విచారణ చెయ్యడానికి కస్టడీకి ఇవ్వాలని సీసీబీ పోలీసులు కోర్టుకు మనవి చేశారు. అక్తర్ హుస్సేన్ ను 10 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ చెయ్యడానికి కోర్టు బెంగళూరు సీసీబీ పోలీసులకు అనుమతి ఇచ్చిందని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

English summary
Terrorist: Bengaluru CCB police arrest another terror suspect from city
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X