వారికోసం దళపతి విజయ్ కోటిరూపాయల విరాళం... నా అభిమానహీరో అంటూ హీరో విశాల్ పోస్ట్!!
కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తానని ప్రకటించిన విజయ్, తనకు ఎంతో సహకారాన్ని అందించి, తన ఎదుగుదలకు కారణమైన సినిమా పరిశ్రమకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తున్నారు. తాజాగా విజయ్ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవన నిర్మాణం కోసం కోటి రూపాయలు విరాళాన్ని అందించారు.
హీరో విజయ్ ఔదార్యం పై హీరో విశాల్ x వేదికగా కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. థాంక్యూ అన్నది కేవలం రెండు పదాలు కావచ్చు కానీ హృదయం లోపలి నుంచి వచ్చే ఆ మాటకు విశాలమైన భావన ఉందంటూ హీరో విజయ్ పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశారు హీరో విశాల్.

నా అభిమాన నటుడు, నాకు అత్యంత ఆప్తుడైన దళపతి విజయ్ కోటి రూపాయలు విరాళం నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం ఇచ్చారని హీరో విశాల్ ప్రకటించారు. ఆయనకు దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో నడిగర్ సంఘ భవన నిర్మాణం గురించి మాట్లాడిన హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీకందరికీ తెలుసు.. మీ అందరి సహకారం, ప్రమేయం లేకుండా భవన నిర్మాణం పూర్తి కాదని .. అంటూ వెల్లడించారు. త్వరలోనే అది సాకారం కాబోతుందని పేర్కొన్నారు. ఇక విజయ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చి తీసుకున్న నిర్ణయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని విశాల్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే తమిళ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్ 2026 లో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పోటీ చేస్తుందని, ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయ్ తన పార్టీకి సంబంధించిన విధివిధానాల పైన, పార్టీ కార్యాచరణ, అలాగే గుర్తు తదితర అంశాలపైన కసరత్తు చేస్తున్నారు. అంతే కాదు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి కూడా విజయ్ గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ సినీ పరిశ్రమ పైన తన ఔదార్యంతో మరోమారు వార్తల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications