ఫ్యామిలీ గొడవలు, భర్త మీద దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లి పార్క్ లో ఏం చేశారంటే ?
తనతో గొడవపడ్డ భర్తను వెతుక్కుంటూ కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని గంగావతికి వచ్చిన బెంగళూరుకు చెందిన ఓ మహిళపై అత్యాచారం చేసిన ఘటన కొప్పల్‌లో చోటుచేసుకుంది. కుటుంబ గొడవల కారణాలతో గంగావతి బస్టాండ్‌లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇదే విషయాన్ని అతనికి అనుకూలంగా ఉపయోగించుకున్న ఓ నిందితుడు భర్తపై దాడి చేశాడు.
మహిళను పక్కనే ఉన్న పార్కులోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనకు సంబంధించి గంగావతి పోలీస్ స్టేషన్‌లో ఐదుగురిపై కేసు నమోదైంది. నిందితుల బృందంలోని ఓ నిందితుడు వివాహిత మహిళపై అత్యాచారం చేశాడని, మరికొందరు అతడికి సహకరించారని తెలుస్తోంది. మహిళ గంగావతికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కుటుంబ కలహాల కారణంగా బెంగళూరులో భార్యను వదిలేసిన భర్త అతని సొంత ఊరు అయిన గంగావతికి వెళ్లిపోయాడు. భర్త కోసం బెంగళూరులోని అనేక ప్రాంతాల్లో వెతికిన భార్య చివరికి అతను గంగావతిలో ఉన్నాడని తెలుసుకుంది. భర్తకు నచ్చచెప్పి అతన్ని బెంగళూరుకు పిలుచుకుని వెళ్లాలని అనుకున్న భార్య గంగావతికి చేరుకుంది. భర్త కూడా గంగావతి బస్ స్టాప్ దగ్గరకు వెళ్లాడు.
రాత్రి 9.30 గంటలకు బస్టాప్‌లో దంపతులు గొడవపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకున్న నిందితులు బాధితురాలి భర్తపై దాడి చేశారు. అనంతరం బాధితురాలిని బస్టాండ్ సమీపంలోని పార్కులోకి ఎత్తుకుని వెళ్లి తరువాత ఆమె మీద అత్యాచారం చేశాడని తెలిసింది. వివాహిత మహిళపై లింగరాజ్ అనే నిందితుడు అత్యాచారం చేశాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

మౌలాహుస్సేన్, శివకుమార్ స్వామి, ప్రశాంత్, మహేష్, మాదేష్ అనే నిందితులు లింగరాజు వివాహిత మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి సహకరించారని, నిందితులు కూడా ఆమెను శారీరకంగా ఇబ్బంది పెట్టారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అత్యాచారం చేసిన తర్వాత లింగరాజు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బాధితురాలు గంగావతి నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బస్ స్టాప్ లో, పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications