పోలీసు అధికారి వాహనం మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అసలు మ్యాటర్ తో షాక్ !

బెంగళూరు: అన్నదమ్ములు వ్యాపారం చేస్తున్నారు. రానురాను అన్నదమ్ముల (brother) మధ్య గొడవలు మొదలైనాయి. నిత్యం గొడవలు జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అన్నదమ్ములకు సర్దిచెబుతూ వచ్చారు. అయితే అన్నదమ్ముల గొడవలో తల దూర్చిన పోలీసు అధికారి వాహనంకు నిప్పుపెట్టిన అన్న (brother)అతని పగ తీర్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

బుద్ది మాటలు చెప్పిన ఓ పోలీసు అధికారి స్కూటర్‌కు నిప్పు పెట్టిన ఘటన కర్ణాటకలోని (karnataka) చిక్కబళ్లాపురం జిల్లా గుడిబండ పట్టణంలోని వివేకానంద నగర్‌లో చోటుచేసుకుంది. ఖలీమ్ ఉల్లా అనే నిందితుడు పోలీసు అధికారి వాహనంకు నిప్పు పెట్టాడు. నిందితుడు ఖలీమ్ ఉల్లా గుడిబండలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. తమ్ముడితో (brother) గొడవపడి గాయపడిన ఖలీమ్ ఉల్లా ఆస్పత్రిలో చేరాడు.

The accused who poured petrol on the police officers scooter and set it on fire escaped

ఆసుపత్రిలోనూ నిందితుడు ఖలీమ్ సాటి రోగులకు నిద్రలేకుండా చేశాడు. అర్దరాత్రి పదేపదే కేకలు వేసిన ఖలీమ్ నానా హంగామా చేశాడు. రాత్రి గస్తీ తిరుగుతున్న ఏఎస్సై నంజుండ శర్మా ఆసుపత్రికి వెళ్లి ఖలీమ్ ఉల్లాకు బుద్దిమాటలు చెప్పి వెళ్లారు. అయితే నిందితుడు ఖలీమ్ ఆస్పత్రి నుంచి తప్పించుకుని మళ్లీ అతని సోదరుడి (brother)ఇంటికి చేరుకున్నాడు.

ఇంటి ముందు ఆగి ఉన్న తమ్ముడి (brother) కారు అద్దాన్ని పగులగొట్టిన ఖలీమ్ అతని ఇంటి ముందు నానా హంగామా చేశాడు. మళ్లీ పోలీసులు వెంబడించి నిందితుడు ఖలీమ్ ఉల్లాకు వార్నింగ్ ఇచ్చారు. ఆ సందర్బంలో ఏఎస్ఐ (asi) నంజుండ శర్మా ఖలీమ్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. ఆ సందర్బంలో రెచ్చిపోయిన ఖలీమ్ ఏఎస్ఐ (asi) నంజుండ శర్మాతో గొడవపడ్డాడని తెలిసింది.

అయితే ఖలీమ్ అతని సోదరుడిపై (brother)కోపాన్ని పోలీసులపైకి మళ్లించాడు. తనకు సలహాలు ఇచ్చిన ఏఎస్సై నంజుండ శర్మాను అనుసరించి ఆయన ఇంటి సమీపం వరకు వెళ్లాడు. ఏఎస్సై (asi)నంజుండ శర్మా ఆయన ఇంటి ముందు స్కూటర్‌ను పార్క్ చేసి లోపలికి వెళ్లిపోయారు. ఆ సందర్బంలో నిందితుడు ఖలీమ్ వెంట తీసుకెళ్లిన పెట్రోల్ (petrol) క్యాన్ తీసి ఏఎస్ఐ (asi) స్కూటర్‌ మీద పోసి నిప్పంటించి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఖలీమ్ కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+