కేజీఎఫ్ హీరో సినిమా స్టైల్లో పెళ్లి, కారులోనే అన్ని, క్లైమాక్స్ లో పోలీసులు ఎంట్రీ, అమ్మాయి డబుల్ గేమ్ !
బళ్లారిలో సినిమా స్టైల్‌లో కారులో ప్రేమికులు పెళ్లి చేసుకున్న ఘటన హాట్ టాపిక్ అయ్యింది. కన్నడలో కేజీఎఫ్ ఫేమ్ హీరో యశ్ నటించిన కిరాతక సినిమా స్ట్రైల్ లో ప్రేమికులు కారులో దండలు మార్చుకున్నారు. ఇదే సమయంలో ప్రియుడు అతని ప్రియురాలి మెడలో తాళికట్టాడు. కారులోనే హ్యాపీగా పెళ్లి చేసుకున్న ప్రేమికులు జీవితాంతం కలిసి జీవించాలని డిసైడ్ అయ్యారు. అయితే అక్కడ కథ రివర్స్ అయ్యింది.
శివప్రసాద్, అమృత అనే ప్రేమికులు ప్రేమ వివాహం చేసుకున్న ప్రేమ జంట గురించి ఇప్పుడు చర్చ మొదలైయ్యింది. ప్రేమ వివాహాన్ని ప్రియురాలు అమృత తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ప్రేమికులు ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో ప్రేమ వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. పెళ్లికి కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకోవాలని అమృత అనేక ప్రయత్నాలు చేసింది.

కొప్పళకు చెందిన అమృత అనే యువతి, బళ్లారిలోని టెక్కలకోటేకు చెందిన శివప్రసాద్ అనే యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను అమృత తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అగ్రవర్ణకులానికి చెందిన అమ్మాయి అమృత, తక్కువ కులానికి చెందిన అబ్బాయి అయిన శివప్రసాద్ ప్రేమ పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.
మంగళవారం కుటుంబ సభ్యులను ఎదిరించిన ప్రియురాలు ఆమె ప్రియుడు శివప్రసాద్ ను కారులోనే పెళ్లి చేసుకుంది. చివరికి అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రేమికులను పట్టుకుని పోలీస్ స్టేషన్ లోకి పిలుచుకుని వెళ్లారు. పోలీసులు, ఇరు వర్గాలకు చెందిన పెద్దలు పంచాయితీలు చేసి ప్రేమికులను విడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ ల వరకు వెళ్లింది. ఓసారి తల్లిదండ్రులు కావాలని, మరో సారి ప్రేమికుడు శివప్రసాద్ కావాలని అమృత పోలీసులకు డబుల్ స్టేట్ మెంట్ ఇచ్చింది. అమృత ద్వంద్వ వైకరితో యువతి కుటుంబ సభ్యుల మధ్య, ఆమె ప్రేమికుడి మధ్య హైడ్రామా జరిగింది. యువకుడు శివప్రసాద్ సినిమా స్టైల్లో అతని ప్రియురాలు అమృతను దక్కించుకోవాలని ప్రయత్నించడంతో పోలీస్ స్టేషన్ లోని కౌన్సిలింగ్ కేంద్రం ఎదుట కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.

ఇరువైపుల తల్లిదండ్రుల మధ్య గొడవ కూడా జరిగింది. అమృతను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా కారులో తీసుకెళ్లడంతో నాకు నా భర్త కావాలి అని అమృత కేకలు వేసింది. ఈ సమయంలో ప్రేమికుడు శివప్రసాద్ కారు ఆపి ప్రియురాలు అమృత కోసం ఆమె తల్లిదండ్రులతో గొడవ చేశాడు. ఇదంతా పోలీసుల ఎదుటే జరిగింది. శివప్రసాద్ అతని భార్య అమృత మాకు రక్షణ కావాలని పోలీసులను కోరడంతో గొడవ పెద్దది అయ్యింది.
గుడిలో పెళ్లి చేసుకోవడానికి పెద్దలు అంగీకరించరని భయపడిన ప్రేమికులు అమృత, శివప్రసాద్ చివరికి కారులో సినిమా స్టైల్లో పెళ్లి చేసుకుని ఇప్పుడు పోలీసుల రక్షణ కోరారు. మంగళవారం రాత్రికూడా పోలీసులు ఇరు వర్గాలను రాజీ చెయ్యలేకపోవడంతో బుధవారం కూడా బళ్లారి పోలీసులు ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ప్రియుడు, ప్రియురాలికి చెందిన కులాల పెద్దలు కూడా ఇప్పుడు పంచాయితీలో భాగం కావడంతో చివరికి క్లైమాక్స్ ఎలా ఉంటుందో అంటూ ప్రేమికులతో పాటు వాళ్ల స్నేహితులు టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications