Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్లికూతురితో అక్రమ సంబంధం, కల్యాణమండపంలో లైవ్ లో ప్రియుడి హత్య !

యువతి, యువకుడికి పెళ్లి నిశ్చయం అయ్యింది. పెళ్లికూతరు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న పెళ్లికొడుకు కాబోయే భార్యను మార్చడానికి ప్రయత్నించి విఫలం కావడంతో పెళ్లి రద్దు చేసుకున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు ఓ పెళ్లికి హాజరైనాడు. గంటలో పెళ్లి జరగాల్సి ఉంది. ఆ సందర్బంలో పెళ్లికూతురితో అక్రమ సంబంధం పెట్టుకుని పెళ్లి చెడిపోవడానికి కారణం అయిన యువకుడిని షాదీమహల్ మొత్తం తరిమితరిమి పొడిచి చంపేశాడు.

కర్ణాటకలోని బెళగావి, బీదర్, విజయపూర్, బళ్లారి, కోలార్, బెంగళూరు, చామరాజనగర్, మంగళూరు తదితర జిల్లాల ప్రజలతో పొరుగు రాష్ట్రం అయిన మహారాష్ట్రాలో నివసిస్తున్న కుటుంబాలతో పెళ్లి సంబంధాలు పెంచుకున్నారు. కర్ణాటకలోని పలు జిల్లాలకు చెందిన వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులను పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం అయ్యింది.

 The boyfriend who caused the wedding to be canceled was murdered live in Kalyanamandapam.

మహారాష్ట్రలోని పూణెకు చెందిన తల్లిదండ్రులు తమ కుమార్తెకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని తెలుసుకుని హడలిపోయారు కూతురి అక్రమ సంబంధం విషయాన్ని దాచిపెట్టి కర్ణాటకలోని విజయపురంకు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. హడావుడిగా ముందుగానే అమ్మాయి ఫోటో అబ్బాయికి పంపించిన అమ్మాయి కుటుంబ సభ్యులు శాస్త్రాన్ని పూర్తి చేసి నిశ్చితార్థం చేసుకున్నారు.

వేరే యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యినా పెళ్లి కుమార్తె మాత్రమే ఆమె ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. పెళ్లి చేసుకోబోయే కుమార్తెకు, ఆమెకు సంబంధం ఉన్న యువకుడికి కౌన్సెలింగ్ ఇవ్వాలని పెద్దలు అనేక ప్రయత్నాలు చేశారు. ఇప్సటికే పెళ్లికూతురికి, ఆమె ప్రియుడికి పెద్దలు, పోలీసులు బుద్దిమాటలు చెప్పి పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రేమికులు ఎవరి మాట వినకుండా తమ అక్రమ సంబంధాన్ని కొనసాగించడంతో అక్కడే అసలు కథ మొదలైయ్యింది.

మహారాష్ట్రలోని పూణేలో నివాసం ఉంటున్న తాజ్ ఉన్నిసా (పేరు మార్చడం జరిగింది) అనే యువతికి, కర్ణాటకలోని విజయపురలోని చప్పేబంద్ కాలనీలో నివాసం ఉంటున్న హుసేన్ నందిహాల్ అలియస్ హుస్సేన్ కు పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. ఇప్పటికే హుస్సేన్, తాజ్ ల పెళ్లి నిశ్చితార్థం జరిగింది. దీంతో విజయపురలో పెళ్లి చెయ్యాలని పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. పెళ్లి డేట్ ఫిక్స్ అయిన తరువాత పెళ్లి కొడుకు హుసేన్ కు షాకింగ్ సమాచారం అందింది.

తనకు కాబోయే భార్య తాజ్ ఉన్నిసాకు పూణేలో నివాసం ఉంటున్న అయాన్ షేక్ అలియాస్ అయాన్ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉందని తెలిసింది. అయితే తాజ్ ఉన్నిసా చాలా అందంగా ఉండటంతో అలాంటి అమ్మాయి మళ్లీ చిక్కదు అనుకున్న హుస్సేన్ కాబేయే భార్యకు అక్రమ సంబంధం ఉందని తెలిసినా రాజీ అయిపోయాడు. పెళ్లి తరువాత తాజ్ ఉన్నిసా మారుతుందని, అంతలోపు ఆమె ప్రియుడు అయాన్ ను ఆమెకు దూరం చెయ్యాలని హుస్సేన్ అనుకున్నాడు.

 The boyfriend who caused the wedding to be canceled was murdered live in Kalyanamandapam.

పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని వదిలేయాలని అయాన్ కు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి హుస్సేన్ ఇప్పటికే చాలాసార్లు ఫోన్ చేసి సలహా ఇస్తాడు. అయినా తాజ్ ఉన్నిసా, ఆమె ప్రియుడు అయాన్ షేక్ ఎవరి మాట వినలేదు. దీంతో కోపోద్రిక్తుడైన విజయపురంకు చెందిన యువకుడు హుస్సేన్ పూణే అమ్మాయితో అతని నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాడు. పూణేలో నివాసం ఉండే తాజ్ ఉన్నిసా ఆమె వివాహం రద్దు కావడంతో సంతోషించింది. తాజ్ ఉన్నిసా, ఆమె ప్రియుడు అయాన్ షేక్ పెళ్లి రద్దు కావడంతో తమకే మంచిదని ఆనందంగా వారి అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే తన పెళ్లి చెడిపోవడానికి అయాన్ కారణం అని విజయపురం చెందిన హుస్సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పూణేలో ఉన్న స్నేహితుల సహాయంతో అయాన్ కదలికల మీద నిఘా వేయించాడు. దీంతో పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని తన పెళ్లి చెడిపోవడానికి కారణం అయిన అయాన్ షేక్ ను హత్య చేయాలని హుస్సేన్ నిర్ణయించుకున్నాడు. పుణేకి చెందిన అయాన్ విజయపురలో నివాసం ఉండే అతని బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు విజయపర వచ్చాడు.

ఆ సందర్బంలో అయాన్ తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో షాదీమహల్ మొత్తం తరిమితరిమి పొడిచిన హుసేన్ అతని శత్రువును లైవ్ లో షాది మహల్ లోనే చంపేసి దర్జగా బయటకు వెళ్లిపోయాడు. అయాన్ హత్యతో వేరేవాళ్ల పెళ్లి రద్దు అయ్యింది. పూణే యువకుడు అయాన్ హత్య చేసి తప్పించుకున్న హుస్సేన్ ను కొన్ని గంటల్లోనే అరెస్టు చేసిన విజయపుర పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+