జగన్ ను జాగ్రత్తగా చూసుకో, భార్యకు వాట్సాప్ లో మెసేజ్ పంపించి భర్త ఏం చేశాడంటే ?

బెంగళూరు: అప్పుల విషయంలో తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెంగళూరు (bengaluru)లోని వయాలికావల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కొట్టాడని ఆరోపిస్తూ ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి తలఘట్టపురలో ఆత్మహత్య చేసుకున్నాడు.రఘువనహళ్లి బీసీఎం లేఅవుట్‌కు చెందిన వి. నాగరాజ్ (47) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఉద్యోగానికి వెళ్లిన భార్యకు వాట్సాప్ మెసేజ్ చేసిన తరువాత నాగరాజ్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత మృతుడి భార్య ఇంటికి చేరుకోవడంతో నాగరాజ్ ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. నాగరాజు, వినుత (wife) దంపతులకు 14 ఏళ్ల జగన్ (jagan) అనే కుమారుడు ఉన్నాడు.

The husband committed suicide by sending a death note saying sorry to his wife in the office in Bengaluru.

రఘువనహళ్లిలోని బీసీఎం లేఅవుట్‌లో నాగరాజ్, వినుత (wife) దంపతుల కుటుంబం నివసిస్తోంది. గతంలో బాష్‌లో ఉద్యోగం చేస్తున్న నాగరాజ్ రెండేళ్ల క్రితం కంపెనీ నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందాడు. ఆ తర్వాత నాగరాజ్ (husband) బెంగళూరు నగరంలోని పిణ్యాలో సనావుల్లా అనే వ్యక్తి వద్ద లోన్ తీసుకునే వారి పత్రాల పరిశీలన చేసే ఉద్యోగంలో చేరాడు.

అప్పు విషయమై వాయాలికావల్ పోలీస్ స్టేషన్‌లో నటరాజ్ అనే వ్యక్తి నాగరాజ్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో మంగళవారం వయ్యాలికావెల్ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజ్ ను (husband) పోలీస్‌స్టేషన్‌కు పిలిపించాడు. అనంతరం నాగరాజ్‌ను ఇన్స్ పెక్టర్ ఇష్టం వచ్చినట్లు కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన చక్రపాణి అనే స్నేహితుడు నాగరాజ్‌ (husband)ను విడిపించుకుని ఇంటికి వెళ్లాడు.

బుధవారం కూడా విచారణకు రావాలని వయ్యాలికావెల్ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజ్‌కు సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగరాజ్ ఇంటికి వెళ్లి ఆయన భార్య వినుతకు (wife) జరిగిన విషయం చెప్పి రోదించాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నాగరాజ్ (husband) భార్య వినుత నువ్వు ధైర్యంగా విచారణకు వెళ్లి జరిగిన విషయం చెప్పాలని, నీకు అండగా నేను ఉన్నానని భర్తకు ధైర్యం చెప్పి ఆమె ఉద్యోగానికి వెళ్లింది.

The husband committed suicide by sending a death note saying sorry to his wife in the office in Bengaluru.

ఉదయం 10 గంటలకు వినుత కంపెనీలో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిపోయింది. ఉద్యోగానికి వెళ్లిన భార్య వినుతకు వాట్సాప్ లో దయచేసి నన్ను క్షమించు, గుడ్ బై టెక్ కేర్, జగన్ (jagan) ను బాగా చూసుకో అంటూ మెసేజ్ చేశాడు. తరువాత భార్య వినుతకు (wife) వాట్సాప్‌లో డెత్ నోట్ పంపించిన నాగరాజ్ (husband) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వినుత ఈ మెసేజ్ చూడగానే వెంటనే ఇంటికి పరుగెత్తింది. ఇంటి తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్ కు భర్త నాగరాజ్ (husband) మృతదేహం ఉరివేసుకుని కనిపించిందని వినుత (wife) తలఘట్టపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడు నాగరాజ్ (husband) భార్య వినుత ఫిర్యాదు మేరకు సనావుల్లా, నటరాజ్, ఎంసీ ఈరెగౌడ, వయాలికావల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, హెన్నూరు పోలీస్ స్టేషన్‌ లో ఉద్యోగం చేస్తున్నశివకుమార్‌లపై తలఘట్టపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

మృతుడు నాగరాజ్ అతని స్నేహితుడు దేవరాజ్‌ దగ్గర రూ 9 లక్షలు తీసుకుని హెన్నూరు పోలీస్ స్టేషన్ పోలీసు శివకుమార్‌కు రూ 8 లక్షలు ఇచ్చానని డెత్ నోట్ లో నాగరాజ్ (husband) రాశాడని పోలీసులు అన్నారు. తలఘట్టాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగరాజ్ ఆత్మహత్యకు సంబంధించి నమోదైంది. వయాలికావల్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ (ci) పేరు ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. వయ్యాలికావెల్ ఇన్స్ పెక్టర్ ఎందుకు నాగరాజ్‌ను (wife) పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు అనే కోణంలో విచారణ చేపట్టనున్నాయని బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ శేఖర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+