వేరే వ్యక్తితో ఎంజాయ్, చేస్తున్న భార్య, మార్కెట్ లో అందరి ముందే భార్యను నరికేసిన భర్త !
చంఢీగఢ్/పంజాబ్: దేశంలో క్రైమ్ కేసులు తరచుగా విపరీతంగా నమోదు అవుతున్నాయి. అదేవిధంగా పంజాబ్‌లో మరో క్రైమ కేసు నమోదైంది. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఓ వ్యక్తి అతని భార్యపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.
సంగ్రూర్‌లోని సునమ్ నగర్‌లో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో రద్దీగా ఉండే మార్కెట్ మధ్యలో భార్యపై దాడి చేసి హత్య చేసిన తర్వాత ఆమె భర్త కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మృతి చెందిన మహిళను రాజ్‌విందర్ కౌర్‌గా గుర్తించామని, అయితే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ కోలుకోలేదని, చనిపోయిందని పోలీసులు అన్నారు.

కౌర్ భర్త గురుదయాల్ సింగ్ కూడా ఆసుపత్రిలో చేరినప్పుడు పరిస్థితి విషమంగా ఉంది. అయితే చికిత్స అనంతరం సింగ్ ఆరోగ్యం కుదుటపడుతోందని, వీరిద్దరిని పాటియాలా నగరంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని పోలీసులు అన్నారు. ఈ విడాకుల కేసు విచిత్రంగా మలుపు తిరిగి భార్య హత్యకు గురైయ్యిందని పోలీసులు చెప్పారు.
మార్కెట్ లో వేరే వ్యక్తితో భార్య కౌర్ ను చూసిన ఆమె భర్త సింగ్ కోపోద్రిక్తుడై అదే మార్కెట్ మధ్యలో గొడ్డలితో దాడి చేసి ఆమెను చంపేశాడని పోలీసులు అన్నారు. మరోవైపు భార్య కౌర్ ను హతమార్చిన అనంతరం ఆమె భర్త సింగ్ కూడా విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే, అతన్ని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చగా, అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని పోలీసులు అన్నారు.
సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసు అధికారులు చెప్పారు.ఇదిలా ఉండగా, భార్యపై గొడ్డలితో దాడి చేసిన వ్యక్తి అతని చేతిలో ఆయుధం పెట్టుకుని అదే మార్కెట్‌లో నిలబడి ఉన్న సమయంలో కొందరు వీడియోను చిత్రీకరించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్త గొడ్డలి పట్టుకుని రోడ్డు మధ్యలో నిలబడి ఉండగా నిందితుడి చుట్టూ గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు.

మార్కెట్‌లో గుమిగూడిన గుంపు నిందితుడు అయిన సింగ్ మీద ఇటుకలు, బకెట్లను అతనిపైకి విసిరారు. నిందితుడు సింగ్ తనపై ఇలాంటివి విసిరినందుకు ప్రజల మీద ఆగ్రహం వ్యక్తం చేస్త మిమ్మల్ని చంపేస్తానని అదే ఆయుధంతో బెదిరించాడని పోలీసులు అన్నారు. ఇటుకలతో దాడికి యత్నించిన వారిని గొడ్డలితో బెదిరించి సింగ్ ఆ వీడియోలో కనిపించాడు.
వీడియోలో సింగ్ భార్య కౌర్ మృతదేహం కూడా రోడ్డుపై పడి ఉంది. ఇంకా ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య విడాకులు ఇవ్వడానికి సిద్దం కావడమే కాకుండా మార్కెట్ లో వేరే వ్యక్తితో హ్యాపీగా తిరుగుతూ కనిపించడంతో అతన్ని సింగ్ చంపేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications