ఫ్రెండ్ భార్యతో మస్త్ మజా చేశాడు, మ్యాటర్ తెలిసి మైండ్ బ్లాక్, క్లైమాక్స్ లో ?
బెంగళూరు: భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికి ఆమె భర్త ఫోన్ చేసి కంపెనీ నుంచి వెళ్లిపోవాలని కోరాడు. ఆంటీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సలహా కూడా ఇచ్చాడు. అయితే తనతో వాదిందిన వ్యక్తిని అక్కడికక్కడే కత్తితో పొడిచి చంపిన ఘటన బెంగళూరులోని బీహెచ్‌ఎల్ లేఔట్ లో చోటుచేసుకుంది.
బెంగళూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తిని తబ్రేజ్ (35)గా గుర్తించారు. బీహెచ్‌ఎల్ లేఔట్‌లోని కృష్ణప్ప గార్డెన్‌లో హత్య చేశారు. తిలక్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తిలక్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించి వివరాలు సేకరించారు.

అక్రమ సంబంధం కారణంగా భార్య ప్రేమికుడిని హత్య చేశారని పోలీసు అధికారులు అంటున్నారు. భార్య నూర్ ఆయేషా ప్రియుడు తబ్రేజ్ ను హత్య చేసిన వ్యక్తి పేరు షబ్బీర్ అని పోలీసులు అన్నారు. హత్యకు గురైన తబ్రేజ్‌కు నిందితుడు షబ్బీర్ భార్య నూర్ అయేషాతో అక్రమ సంబంధం ఉందని ఆ ప్రాంతంలోని అందరికి తెలుసు అని పోలీసులు అంటున్నారు.
బుదవారం రోజు తబ్రేజ్, నూర్ ఆయేషాల మధ్య అక్రమ సంబంధం ఉందనే విషయంలో ఆయేషా భర్త షబ్బీర్ గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో గొడవ పెద్దది కావడంతో సహనం కోల్పోయిన షబ్బీర్ అతని భార్య ఆయేషా ప్రియుడు తబ్రేజ్‌ను కత్తితో పొడిచి చంపాడు. తిలక్ నగర్ లో నివాసం ఉండే తబ్రేజ్ కెంగేరి ఉల్లాల శివారులోని ఫర్నీచర్ షాపులో పనిచేసేవాడని, కేసు విచారణలో ఉందని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

అయితే మొదటి నుంచి ఆయేషా, తబ్రేజ్ ల అక్రమ సంబందం గురించి తెలిసిన షబ్బీర్ అతని భార్యతో పాటు ఆమె ప్రియుడికి పదేపదే వార్నింగ్ ఇస్తూ వచ్చాడని, అయితే ఇద్దరూ షబ్బీర్ మాట ఏమాత్రం వినలేదని, సహనం కోల్పోయిన షబ్బీర్ అతని భార్య ప్రియుడిని చంపేశాడని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications