Wife: బాయ్ ఫ్రెండ్స్ తో భార్య ఫుల్ బిజీ, రెండేళ్ల క్రితం భార్యను నమ్మించి ?, ఫ్రెండ్ ఇంట్లోనే పూడ్చేసి ?
భార్య మొబైల్ ఫోన్ లో బాయ్ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు ఎక్కువ కావడంతో భర్త బ్యాటరీ డౌన్ అయ్యి బీపీ లెవర్స్ పెరిగిపోయాయి. రెండేళ్ల క్రితం భార్య మాయం అయ్యింది. దెబ్బకు భర్త ఫ్రెండ్ ఇంట్లోని భూమిలో భార్య అస్తిపంజరం చిక్కింది.
రాంచీ/జార్ఖండ్: వివాహం చేసుకున్న దంపతుల కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. భర్త అతని భార్య పుట్టింటికి వెళ్లి అత్తారింటి కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగానే ఉండేవాడు. భార్య కూడా ఆమె భర్త కుటుంబ సభ్యులు, బంధువులతో చాలా అన్యోన్యంగా ఉండేది. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య మొబైల్ ఫోన్ లో బాయ్ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు ఎక్కువ అయ్యాయి. భార్య మొబైల్ ఫోన్ నెంబర్ బిజీ అయిపోయింది. ఇదే సమయంలో భర్త బ్యాటరీ డౌన్ అయ్యి బీపీ లెవర్స్ పెరిగిపోయాయి. రెండు సంవత్సరాల క్రితం భార్య మాయం అయ్యింది. దెబ్బకు భర్త ఫ్రెండ్ ఇంట్లోని ఫ్లోరింగ్ భార్య అస్తిపంజరం చిక్కింది. అక్రమ సంబంధాలు పెట్టుకున్న భార్యను ఆమె భర్త ఏ రైంజ్ లో హత్య చేశాడో అని తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు.

దంపతులు హ్యపీ
జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలో మనీష్ బరన్వాల్ అనే వ్యక్త నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అర్జుమన్ బానో అలియాస్ బానే అనే మహిళను మనీష్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దంపతులు మొదట్లో చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులు ఇద్దరు ఇరువైపు బంధువుల ఇళ్లకు తెగ తిరిగేశారు. మనీష్ భార్య బానో చూడటానికి చాలా అందంగా ఉందని అతని బంధువులు అందరూ ముచ్చటపడ్డారు.

భార్యకు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ
రానురాను మనీష్, బానో దంపతుల మధ్య తరచూ విబేధాలు, గొడవలు మొదలైనాయి. భార్య బానో మొబైల్ ఫోన్ లో ఇతరులు, మగాళ్ల ఫోన్ నెంబర్లు ఎక్కువగా ఉండటంతో ఆమె భర్త మనీష్ మండిపడుతూ వచ్చాడు. భార్య బానో ఇతరులతో ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడటం ఆమె భర్త మనీష్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే విషయంలో చాలాసార్లు పెద్దలు బానో, మనీష్ దంపతుల మధ్య పంచాయితీలు చేశారు. అయినా బానో మాత్రం ఆమె పద్దతులు మార్చుకోలేదని తెలిసింది.

భార్యను చంపేయాలని స్కెచ్
పద్దతి మార్చుకోని భార్య బానోను హత్య చేయాలని ఆమె భర్త మనీనష్ పథకం వేశాడు. 2021 డిసెంబర్‌లో మనీష్ అథని భార్య బానోను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. అదే రోజు మనీష్ అతని భార్యను స్నేహితుడి ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. చివరికి మనీష్ అతని స్నేహితుడితో కలిసి భార్య బానో గొంతుకోసి అతి దారుణంగా హత్య చేశారు. భార్య శవాన్ని బయటకు తరలించి మాయం చెయ్యడినికి మనీష్ రెండు రోజులు ప్రయత్నించి విఫలం అయ్యాడు.

ఫ్రెండ్ ఇంట్లోనే భార్య శవం పూడ్చేశాడు
బానోను మృతదేహాన్ని స్నేహితుడి ఇంట్లో గొయ్యి తీచి పూడ్చిపెట్టిన మనీష్ తరువాత ఇంట్లో నీట్ గా ప్లాస్టింగ్ చేశారు. భార్య బానో గురించి ఏమీ పట్టనట్లు మనీష్ వ్యవహరించాడు. కొద్దిరోజుల తరువాత ఎవ్వరికి అనుమానం రాకుండా తన భార్య బానో కనపడటం లేదని, ఆమెను వెతకాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన మనీష్ అతను కూడా భార్య కోసం వెతికినట్లు నటించాడు.

భార్య మొబైల్ ఫోన్ లో ?
పోలీసులు మనీష్ భార్య బానో ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. బానో చాలా మంది మగాళ్లతో మాట్లాడిన విషయం వెలుగు చూసింది. అక్రమ సంబంధం పెట్టుకుని ఎవరితోనో బానో పారిపోయి ఉంటుందని పోలీులు అనుమానం వ్యక్తం చేశారు. బానో మిస్సింగ్ కేసు దర్యాప్తును పోలీసులు అంతంతమాత్రంగానే చేశారని తెలిసింది. అయితే బానో కుటుంబ సభ్యులు మనీష్ మీద కేసు పెట్టడంతో కథ అడ్డం తిరిగింది.

అస్తిపంజరం మాత్రం మిగిలింది
బానో మిస్సింగ్ కేసుతో పాటు ఆమెను భర్త హత్య చేశాడని అరోపణలు రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల విచారణలో మనీష్ మ్యాటర్ మొత్తం చెప్పాడు. తన భార్య బానో అక్రమ సంబంధాలు పెట్టుకుందని తెలుసుకుని ఆమెను చంపేశామని మనీష్ అంగీకరించాడు. మనీష్ స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టిన బానో శవం బయటకు తీస్తే శవం కుళ్లిపోయి అస్తిపంజరం మాత్రం చిక్కింది.

రెండేళ్లకు చిక్కిపోయిన భర్త
బానో అస్తింపజరంలోని ఎముకలను డీఎన్ఏ పరీక్షలకు పంపించామని జార్ఖండ్ పోలీసులు అన్నారు. మనీష్ ను అరెస్టు చేశామని, అతని ఫ్రెండ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం కారణంగా సుమారు రెండు సంవత్సరాల క్రితం భార్య బానోను హత్య చేసిన ఆమె భర్త మనీష్ ఇప్పుడు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications