The Kerala Story.. కలకలం: ముంబై పోలీసులు అప్రమత్తం

ముంబై: లేటెస్ట్‌గా విడుదలైన బాలీవుడ్ మూవీ ది కేరళ స్టోరీ. రాజకీయంగా దుమారం రేపుతోంది. కేరళకు చెందిన వేలాదిమంది మహిళలు మాయం అవుతున్నారని, లవ్ జిహాద్ పేరుతో వాళ్లంతా బలవంతంగా మత మార్పిడికి గురవుతున్నారని, భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ సిరియా అండ్ లెవాంట్‌లో చేరుతున్నారనేది ఈ సినిమా సారాంశం. దీని చుట్టూ కథను అల్లుకుని తెరకెక్కించారు దర్శకుడు సుదీప్తొ సేన్.

అదా శర్మ లీడ్ క్యారెక్టర్‌లో నటించారు. యోగితా బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నాని, దేవదర్శిని, విజయ్ కృష్ణ, ఇతర పాత్రలను పోషించారు. 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కింది ది కేరళ స్టోరీ. సన్‌ షైన్ బ్యానర్స్ కింద నిర్మాత విపుల్ షా ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 5వ తేదీన ఈ సినిమా విడుదలైంది. రాజకీయ దుమారానికి కేంద్రబిందువయింది.

 The Kerala Story

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ సినిమా కథాంశాన్ని తప్పుపట్టారు. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించారంటూ మండిపడ్డారు. మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటీషన్లు కూడా దాఖలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈ సినిమా ప్రదర్శనను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా ప్రకటించారు.

ఈ మూవీ మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా ఉందంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలతోనే ఈ సినిమా తెరకెక్కిందంటూ మమత బెనర్జీ విమర్శించారు. తాను అధికారంలోకి రాష్ట్రాలపై బురదజల్లడం, అక్కడి ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకుని రావడం అలవాటేనంటూ పరోక్షంగా భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి చెప్పారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్దిని పొందే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు.

ఈ కేరళ స్టోరీ సినిమా- మరోసారి కలకలం రేపింది. ఈ మూవీ యూనిట్ సభ్యుడికి బెదిరింపులు అందాయి. గుర్తు తెలియని నంబర్ నుంచి అతనికి మెసేజీలు వెళ్లాయి. ప్రాణహాని తలపెడతామంటూ బెదిరించారు. ఒంటరిగా తిరగొద్దని, ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాలంటూ బెదిరింపు మెసేజీలు అందాయి. ఈ విషయాన్ని మూవీ దర్శకుడు సుదీప్తొ సేన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

తన యూనిట్ సిబ్బందికి అందిన ఈ మెసేజీలను పోలీసులకు చూపించారు. దీనితో ముంబై పోలీసులు బెదిరింపు మెసేజీలను అందుకున్న యూనిట్ సభ్యుడి ఇంటి వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. దర్శకుడు సుదీప్తొ సేన్, నిర్మాత విపుల్ షా, ఇతర కీలక యూనిట్ టెక్నీషియన్లకు రక్షణ కల్పిస్తామని ముంబై పోలీసులు హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+