హైకోర్టు లాయర్ ను లేపేశారు, అపార్ట్ మెంట్ కారు పార్కింగ్ ఏరియాలో ఏం జరిగిందంటే ?

వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. భర్త హైకోర్టులో లాయర్ గా పని చేస్తున్నాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త హైకోర్టులో, స్థానిక కోర్టులో కేసులు వాదిస్తూ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. హైకోర్టులో మంచి లాయర్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అంతలోనే హత్యకు గురైనాడు.

కర్ణాటకలోని కలబురిగి నగరంలో గురువారం హైకోర్టు న్యాయవాదిని దుండగులు దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి ఈరన్న గౌడ పాటిల్ అలియాస్ ఈరన్న పాటిల్ (40) అనే హైకోర్టులో న్యాయవాది. కర్ణాటకలోని ధారవాడ డివిజన్ బెంచ్ హైకోర్టులో కూడా ఈరన్న పాటిల్ అనేక కేసులు వాదిస్తున్నాడు. హైకోర్టు న్యాయవాదిని కలవడానికి చాల మంది క్లైంట్లు వచ్చి వెలుతున్నారు

The killers brutally murdered the High Court lawyer in the parking area of the apartment car and fled

ఎప్పటిలాగే ధారవాడ హై కోర్టులో కేసుల విచారణకు వెళ్లేందుకు గురువారం అపార్ట్‌మెంట్‌ నుంచి దిగిన లాయర్ ఈరన్న పాటిల్ ఆయన కారు దగ్గరకు నడుచుకుంటూ వెలుతున్నాడు. కారు వద్దకు రాగానే దుండగులు ఈరన్న పాటిల్ మీద దాడి చేసి కత్తులతో పొడిచి అతని తల మీద బండరాళ్లు వేసి అతడి తలను నుజ్జునుజ్జు చేసి హత్య చేసి పరారయ్యారు.

విషయం గుర్తించిన అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు భూ తగాదాల కారణంగా ఈరన్న పాటిల్ హత్య జరిగి ఉంటుందని, బంధువులే హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అయితే కేసులు విచారణ విషయంలో కూడా ఈరన్న పాటిల్ హత్యకు గురి అయ్యే అవకాశం ఉందని అనుమానం రావడంతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.

ఈరన్న పాటిల్ భార్య, కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కలబురగి వీవీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైకోర్టు న్యాయవాది ఆయన నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కారు పార్కింగ్ ఏరియాలో హత్యకు గురి కావడంతో అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వాళ్లు హడలిపోయారు. కేసును పలు కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+