ఎయిర్ పోర్టులో ఉద్యోగం, ప్రియుడిని చంపేసి ముక్కలుగా నరికేసి విసిరేసిన కన్నింగ్ లేడీ !
చెన్నై/పుదుక్కోటై: అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వేరే జిల్లాలో ఉన్న మహిళ అతనికి పరిచయం అయ్యింది. పరిచయం అయిన మహిళతో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలం ఆమెతో సహజీవనం చేసిన యువకుడు తరువాత ఆమెను గుడిలో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అయితే సహజీవనం చేస్తున్న మహిళ ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేసి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి విసిరేసిందని వెలుగు చూడటం కలకలకం రేపింది.
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో గ్రౌండ్ స్టాఫ్ లో ఉద్యోగం చేస్తున్నజయంతన్ అనే యువకుడు చెన్నై శివార్లలోని నంగనల్లూరులోని అతని సోదరి ఇంటిలో నివాసం ఉంటున్నాడు. నంగనల్లూరులోని సోదరి ఇంటి నుంచి ప్రతిరోజు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లి వస్తున్న జయంతన్ హ్యాపీగా ఉండేవాడు.
తమిళనాడులోని పుదుక్కోటైలో నివాసం ఉంటున్న బక్కియలక్ష్మి అలియాస్ లక్ష్మి (39) అనే మహిళ గత ఏడాది జయంతన్ కు పరిచయం అయ్యింది. బక్కియలక్ష్మి సెక్స్ వర్కర్. మొదట జయంతన్ కు సెక్క్ వర్కర్ గా పరిచయం అయిన బక్కియలక్ష్మి తరువాత అతన్ని వలలో వేసుకుంది. కొంతకాలం అప్పుడప్పుడు కలుస్తున్న జయంతన్, బక్కియలక్ష్మి తరువాత సహజీవనం చెయ్యడం మొదలుపెట్టారు.

మార్చి 18వ తేదీ నుంచి తన సోదరుడు జయంతన్ కనపడకుండా పోయాడని అతని సోదరి పజవంతగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మార్చి 20వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసి జయంతన్ కోసం గాలించారు. జయంతన్ చివరి సారిగా బక్కియలక్ష్మితో మాట్లాడాడని, పుదుక్కోటైలో అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని పోలీసులు గుర్తించారు. పోలీసులు బక్కియలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.
బక్కియలక్ష్మి గంటకు ఒకమాట చెప్పడం, పోలీసులను తికమక పెట్టడానికి ప్రయత్నించడం చేసింది. పోలీసులు బెండ్ తీస్తే బక్కియలక్ష్మి అసలు మ్యాటర్ బయటకు చెప్పింది. తనను కలవడానికి వచ్చిన జయంతన్ ను తాను హత్య చేశానని బక్కియలక్ష్మి అంగీకరించింది. మరో వ్యక్తితో కలిసి కసాయి కత్తి (మటన్ కత్తిరించే కత్తి)తో జయంతన్ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ ముక్కలను చెన్నై శివార్లలోకి కోవలం ప్రాంతంలో విసిరేశానని బక్కియలక్ష్మి అంగీకరించిందని పోలీసులు అన్నారు.
సెక్స్ వర్కర్ అయిన బక్కియలక్ష్మి నిత్యం చెన్నై వచ్చి వెళ్లేదని, ఆ సమయంలో అక్కడి మగాళ్లు చాలా మంది ఆమెకు తెలుసని, జయంతన్ శవాన్ని ముక్కలు చేసి వాటిని చెన్నై శివార్లలో విసిరేయడానికి వారి సహాయం తీసుకుందని పోలీసులు అన్నారు. జయంతన్ శవంలోని ముక్కలు విసిరేయడానికి పుదుక్కోటై నుంచి రెండుసార్లు బస్సులో. మరోసారి క్యాబ్ లో బక్కియలక్ష్మి చెన్నై వచ్చిందని పోలీసులు అన్నారు.
గత ఏడాది బక్కియలక్ష్మి, జయంతన్ గుడిలో పెళ్లి చేసుకున్నారని తెలిసిందని, కొంతకాలం సహజీవనం చేసిన తరువాత మళ్లీ ఇద్దరూ విడిపోయారని, అయితే ఈ విషయం జయంతన్ ఇంటిలో తెలుసా ?, తెలీదా ? అనే విషయం గురించి ఆరా తీస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. మొత్తం మీద ఓ సెక్స్ వర్కర్ ఆమె బాయ్ ఫ్రెండ్ ను హత్య చేసి అతని శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి వాటికి వేరే ప్రాంతంలో విసిరేయడం కలకలం రేపింది. జయంతన్ హత్యకు బుక్కియలక్ష్మికి సహకరించిన ఆమె స్నేహితుడు, మరి కొందరి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications