Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ చేరిన సీఎం: మంత్రివర్గ విస్తరణ- శాఖల కేటాయింపు ఇలా

Maharashtra Cabinet expansion: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. దేశ రాజధానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం హస్తినకు రావడం ఇదే తొలిసారి. రెండు రోజలు పాటు దేశ రాజధానిలో గడపనున్నారు. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను మర్యాదపూరకంగా కలుసుకోనున్నారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ సమావేశం కానున్నారు ఫడ్నవిస్. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించనున్నారు. మంత్రివర్గ కూర్పుతో కూడిన జాబితాను సైతం ఆయన తన వెంట తెచ్చుకున్నారు. దీనిపై అధిష్ఠానంతో చర్చించిన అనంతరం ఆమోద ముద్ర వేయించుకోనున్నారు.

The Maharashtra cabinet expanstion is likely to take place by December 14 say Reports

ఈ నెల 14వ తేదీన మహారాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనకు హోమ్ శాఖ ఇవ్వట్లేదని సమాచారం. అలాగే- కీలకమైన రెవెన్యూ మంత్రిత్వ శాఖను కూడా కేటాయించే అవకాశం లేదని చెబుతున్నారు. దీనికి బదులుగా మున్సిపల్ మంత్రత్వ శాఖను ఇస్తారని తెలుస్తోంది.

మహారాష్ట్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 43 బెర్తులకు చోటు లభిస్తుంది. ముఖ్యమంత్రితో కలుపుకొని బీజేపీకి 21 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. మిగిలిన వాటిని మహాయుటి మిత్ర పార్టీలు శివసేన, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గానికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి దక్కొచ్చు. ఇందులో శివసేన- 12, ఎన్సీపీ (అజిత్ పవార్)కి 10 బెర్తులు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది.

కాగా- ఈ నెల 5వ తేదీన మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పటి నుంచి మంత్రివర్గ కూర్పుపై ఎడతెగని కసరత్తు సాగుతూనే వచ్చింది. ఇది కొలిక్కా రావడంతో ఆ జాబితాతో దేవేంద్న ఫడ్నవిస్ ఢిల్లీకి చేరుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+