కొత్త పెళ్లికొడుకును కసితీరా 100 సార్లు పొడిచారు. ఒక్కొక్కటి కాదు చింటూ ఒకేసారి వందసార్లు పొడుస్తామ్ !

పాట్నా/బీహార్: యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. వయసులో ఉన్న యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. యవ్వనంలో ఉన్న యువకుడు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. నెల రోజుల ముందు అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. దంపతులు హ్యాపీగా ఉన్నారు. ఉదయం ఇంటి నుంచి కొత్త పెళ్లికొడుకు బయటకు వెళ్లాడు. అంతే తరువాత ఆ యువకుడు కనపడలేదు. కొత్త పెళ్లి కొడుకును కత్తులతో 100 సార్లకు పైగా పొడిచి ముఖంతో పాటు శరీరంలోని ఇతర అవయవాలు గుర్తు పట్టకుండా దారుణంగా హత్య చేసి శవాన్ని విసిరేయడం కలకలం రేపింది.

హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు

హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు

బీహార్ లోని సీతామర్హీ నగర్ ప్రాంతంలో చింటూ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చింటూకు కేవలం 21 ఏళ్ల వయసు. చింటూ సొంతంగా హోల్ సేల్ గుజరీ వ్యాపారం చేస్తున్నాడు. వయసులో ఉన్న చింటూకు పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. యవ్వనంలో ఉంటూ బాగా డబ్బులు సంపాధిస్తున్న చింటూ కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. నెల రోజుల ముందు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో చింటూ అందమైన యువతిని వివాహం చేసుకున్నాడు.

మాయం అయిన కొత్త పెళ్లి కొడుకు

మాయం అయిన కొత్త పెళ్లి కొడుకు

వివాహం చేసుకున్న భార్యతో చింటూ చాల సంతోషంగా కాపురం చేశారు. పెళ్లి జరిగి నెల రోజులు మాత్రమే కావడంతో దంపతులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మంగళవారం ఉదయం చింటూ ఎప్పటిలాగే వ్యాపారం చెయ్యడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత చింటూ కనపడలేదు. చింటూ కోసం అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పలు ప్రాంతాల్లో గాలించారు. అయితే చింటూ ఆచూకి మాత్రం చిక్కకపోవడంతో అతని సోదరుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో చింటూ కనపడటం లేదని మిస్సింగ్ కేసు పెట్టాడు.

దారుణంగా 100 సార్లు పొడిచి చంపేశారు

దారుణంగా 100 సార్లు పొడిచి చంపేశారు

ఓ యువకుడిని దుండగులు 100 సార్లు కత్తితో పొడిచి చంపారు. సమీపంలోని పొదల్లో యువకుడి మృతదేహం లభ్యమైంది. యువకుడిని 100 సార్లు కత్తితో పొడిచి చంపేశారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. యువకుడిని 100 సార్లు కంటే ఎక్కువగా కత్తులతో పొడిచి చంపేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. ఇంటి నుంచి బయటకు వెళ్లి కనపడకుండా పోయిన గుజరీ వ్యాపారి చింటూనే దారుణ హత్యకు గురైనాడని పోలీసు అధికారులు తెలిపారు.

హోలీ రోజు ఏం జరిగింది ?

హోలీ రోజు ఏం జరిగింది ?

మృతుడు చింటూ సోదరుడు అతని పక్క ఇంటిలో నివాసం ఉంటున్న వ్యక్తి తన సోదరుడు చింటూను హత్య చేశాడని ఆరోపిస్తూ కేసు పెట్టారు.తన పొరుగింటి రామ్ మహ మా తమ్ముడు చింటూను హత్య చేశాడని ఆరోపిస్తూ కేసు పెట్టారు. హోలీ రోజున చింటూ, అతని భార్య రంగులు చల్లుకుని ఆడుకుంటున్నారని, ఆ సమయంలో రామ్ మహా చింటూ భార్య మీద రంగులు చల్లి, నీళ్లు పోసి అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు చెప్పారు, ఆ సమమంలో రామ్ మహాకు, చింటూల మధ్య వాగ్వాదం జరిగిందని, అదే చింటూ హత్యకు దారి తీసిందని అతని సోదరుడు పోలీసులకు చెప్పాడు. అయితే రామ్ మహా పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+