లేడీస్ హాస్టల్ బాత్ రూమ్ లో సీక్రెట్ కెమెరా సెట్ చేసిన పక్కింటి ఓనర్, వైఫై కనెక్ట్ చేసి లైవ్ లో !
విద్యార్థినుల హాస్టల్ బాత్ రూమ్ లో కెమెరా పెట్టుకున్న కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు, విద్యార్థినుల హాస్టల్‌లో కెమెరా పెట్టి, ఆ కెమెరాకు వై-ఫై కనెక్ట్ చేసి ఇంట్లో కూర్చొని ఆ వీడియోలు చూస్తున్నాడని పోలీసులు తెలిపారు. పక్కాప్లాన్ చేసిన నిందితుడు అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడాడని పోలీసు అధికారులు తెలిపారు.
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని జీవర్గి తాలూకాలోని మైనారిటీ అమ్మాయి హాస్టల్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాత్‌రూమ్‌లో కెమెరా ఉండటాన్ని ఓ విద్యార్థిని గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులు బాత్‌రూమ్ నుంచి బయటకు వచ్చి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే ఈసారి నిందితుడు తప్పించుకున్నాడు.

ఆ తర్వాత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జీవర్గి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. కలబురగి జిల్లా జేవర్గి తాలూకాలోని మైనార్టీ హాస్టల్‌ను పోలీసులు పరిశీలించారు. నిందితుడు సలీం హాస్టల్ భవనానికి పక్కనే ఉన్న ఇంటిలో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌లో సీక్రెట్ కెమెరాను కొనుగోలు చేసిన నిందితుడు సలీమ్ దానికి కొంతకాలం అతని దగ్గర పెట్టుకున్నాడు.
తరువాత పైపు ద్వారా అమ్మాయిల హాస్టల్ లోని బాత్‌రూమ్‌లో ఆ కెమెరాను అమర్చాడు. వై-ఫై ద్వారా దీనికి కనెక్ట్ చేసిన నిందితుడు సలీమ్ అతని ఇంట్లో కూర్చొని లైవ్ చూడటం మొదలుపెట్టాడు. ఉదయం విద్యార్థిని బాత్‌రూమ్‌కి వెళ్లగా కెమెరా ఆమె కంటికి కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన కెమెరాను తనిఖీ చేయగా అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. హాస్టల్ పక్కనే నిందితుడు సలీమ్ ఇల్లు ఉంది, సలీమ్ కు ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications