వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: సినీ ఫక్కీలో పోలీసుల ఛేజింగ్.. చివరికి ఏం జరిగిందంటే..

|
Google Oneindia TeluguNews

రోడ్డుపై క్రిమినల్స్, పోలీసులు ఎదురుపడడం. పోలీసులు క్రిమినల్స్ ఛేజ్ చేయడం. స్టంట్ లు చేయడం సినిమాల్లోనే చూస్తాం. కానీ ఓ చోట నిజంగా ఛేజింగ్ జరిగింది. ఓ చోట క్రిమినల్స్‌కు పోలీసులు ఎదురుపడ్డారు. వారు ఎస్ యూవీ వాహనాల్లో ఎదురు పడ్డారు. అయితే అక్కడ రోడ్డు ఇరుక్క ఉండడంతో నేరస్థులు పారిపోయారు. కానీ పోలీసులు క్రిమినల్స్ ను వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది.

పోలీసులు, క్రిమినల్స్ ఎదురు పడడం, నేరస్థులు పరుగెత్తడం, వారి వెంటే పోలీసులు పరుగెత్తడం మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఛేజింగ్ లో పోలీసులు విజయం సాధించారు. ఇద్దరు నేరస్థులను పట్టుకున్నారు. దాదాపు ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోలో పోలీసులు, ఒక చిన్న దుకాణాలు, చుట్టుపక్కల అనేక మంది దుకాణదారులతో నిండిన మార్కెట్ లో రెండు SUVలు అడ్డుపడడం చూడవచ్చు.

The police chased and caught the criminals in Amritsar, Punjab

వీడియోలో ఆరుగురు పోలీసులు మనుషుల వెంట పరుగెత్తడం కనిపిస్తుంది. నేరస్థుల కారులో మరెవరైనా ఉన్నారా అని తనిఖీ చేయడానికి ఒక పోలీసు తిరిగి రావడం కనిపిస్తుంది. రవి, రాబిన్ అనే ఇద్దరు వ్యక్తులను మాత్రమే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. "ఇద్దరిపై 5-6 క్రిమినల్ యాక్టివిటీ కేసులు నమోదయ్యాయి. వారి వద్ద నుంచి ఐదు ఆయుధాలు, లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

English summary
The police chased and caught the criminals in Amritsar, Punjab. This video is going viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X