Gold Price Today: శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర..!

మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధర గత వారం రోజులుగా తగ్గుతూ వస్తోంది. వారం రోజుల్లో పసిడి ధర రూ.2000 వేలకు పైగా తగ్గింది. అయితే బంగారం ధర ఇంకా తగ్గుతుందా.. ఇదే స్థాయిలో ఉంటుందా లేక పెరుగుతుందా అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిపుణులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రపంచ పరిస్థితులు, స్టాక్ మార్కెట్లను బట్టి పసిడి ధరలో మార్పులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే బంగారం ధర ఇప్పటికీ కూడా ఎక్కవగానే ఉన్నట్లు చెబుతున్నారు.

భవిష్యత్ లో ధర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతన్నప్పటికీ అంతర్జాతీయ కారణాలతో పసిడి ధర తగ్గుతున్నట్లు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడంతో పుత్తడి ధర తగ్గుతూ వస్తోంది. గతేడాది ఇదే సమయంలో తులం బంగారం ధర రూ.60 వేలకు పైగా ఉండేది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నుంచి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే బడ్జెట్ సమయంలో పసిడి దిగుమతిపై సుంకం తగ్గించడంతో అప్పుడు పుత్తడి ధర తగ్గింది.

The price of gold which has been decreasing for a week also decreased on Thursday

ఆ తర్వాత మళ్లీ పెరిగింది. ఒకానొక సమయంలో రూ.80 వేలు చేరింది. ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం 10 గ్రాములు 24 క్యారెట్ల పసిడి రూ. 76 వేల 850 వద్దకు చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 70, 450కు తగ్గింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 70,440 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెంట్ల పుత్తడి ధర రూ.76,840 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ. 70,590 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 76,990 గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,440 గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 76,840 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 76,840 ఉండగా.. చెన్నైలో రూ. 76,840, బెంగళూరులో రూ. 76,840, కోల్‌కతాలో రూ. 76,840, కేరళలో రూ. 76,840 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు క్రితం సెషన్ ట్రేడింగ్‌తో చూస్తే ఇవాళ ఏకంగా 40 డాలర్లు తగ్గింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+