rowdy: జిల్లా బహిష్కరణ, అజ్ఞాతవాసి ఎంట్రీ, కౌన్సిలర్, రౌడీ ఏం చేశారంటే ?, కత్తులతో పోలీసులను !

జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆ రౌడీషీటర్ ను జిల్లా నుంచి బహిష్కరించారు. బహిష్కరణకు గురైన రౌడీ అతని ఇంటికి వెళ్లాడు. రౌడీషీటర్ ను అరెస్టు చెయ్యడాకి వెళ్లిన పోలీసుల మీద ఆ రౌడీషీటర్,

బెంగళూరు/ధారవాడ: పట్టణంలో పేరుమోసిన రౌడీషీటర్. ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో అతను కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. రౌడీషీటర్ ఆగడాలు ఎక్కువ కావడంతో అతని కారణంగా పట్టణంలో శాంతిభద్రతలకు అంతరాయం ఏర్పడుతుందని పోలీసులు పై అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆ రౌడీషీటర్ ను జిల్లా నుంచి బహిష్కరించారు. బహిష్కరణకు గురైన రౌడీషీటర్ అతని ఇంటికి వెళ్లాడు. రౌడీషీటర్ ను అరెస్టు చెయ్యడాకి వెళ్లిన పోలీసుల మీద ఆ రౌడీషీటర్, కౌన్సిలర్ తో పాటు అతని మద్దతుదారులు దాడులు చేసి కత్తులతో పోలీసులనే బెదిరించడం కలకలం రేపింది.

రౌడీషీటర్ జిల్లా బహిష్కరణ

రౌడీషీటర్ జిల్లా బహిష్కరణ

కర్ణాటకలోని ధారవాడ జిల్లాలోని లక్ష్మేశ్వర పట్టణంలో అబ్దుల్ అనే రౌడీషీటర్ నివాసం ఉంటున్నాడు. లక్ష్మేశ్వర పట్టణంలో పేరుమోసిన రౌడీషీటర్ అబ్దుల్ మీద ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో అతను కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. రౌడీషీటర్ అబ్దుల్ ఆగడాలు ఎక్కువ కావడంతో అతని కారణంగా పట్టణంలో శాంతిభద్రతలకు అంతరాయం ఏర్పడుతుందని పోలీసులు పై అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆ రౌడీషీటర్ అబ్దుల్ ను ధారవాడ జిల్లా నుంచి బహిష్కరించారు.

టైమ్ అయిపోయింది.... ఇంటికి వచ్చాడు

టైమ్ అయిపోయింది.... ఇంటికి వచ్చాడు

జిల్లా నుంచి బహిష్కరణకు గురైన అబ్దుల్ ఇటీవల అతని ఇంటికి వెళ్లాడు. లక్ష్మేశ్వర్ పట్టణంలోని ఇంటిలో అబ్దుల్ నివాసం ఉంటున్నాడు. ఇంటికి వచ్చిన నిందితుడు అబ్దుల్ ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల మీద అతని మద్దతుదారులు దాడి చేసి పోలీసులనే చంపేస్తామని బెదిరించడం కలకలం రేపింది. లక్ష్మేశ్వర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదుట రాత్రి జరిగిన ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో రౌడీషీటర్ అబ్దుల్ ను అతని మద్దతుదారులు తప్పించడంతో అతను పరారైనాడు.

అజ్ఞాతవాసం ముగిసింది

అజ్ఞాతవాసం ముగిసింది

ఇటీవలే అజ్ఞాతవాసం ముగియడంతో గత కొన్ని రోజులు క్రితం రౌడీషీటర్ అబ్దుల్ లక్ష్మేశ్వర్ పట్టణంలోని అతని ఇంటికి వచ్చి అక్కడే నివాసం ఉంటున్నాడు. రౌడీషీటర్ అబ్దుల్ మీద ఇప్పటికే 12కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉండడంతో అబ్దుల్‌ను గూండా యాక్ట్‌ కింద అరెస్టు చేయాలని ధారవాడ జిల్లా కలెక్టర్‌ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అబ్దుల్‌ను అరెస్టు చేసేందుకు లక్ష్మేశ్వర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ప్రకాష్ నేతృత్వంలోని 15 మంది పోలీసుల బృందం రౌడీషీటర్ అబ్దుల్ ఇంటి దగ్గరకు వెళ్లారు.

పోలీసులనే కత్తులతో బెదిరించిన గ్యాంగ్

పోలీసులనే కత్తులతో బెదిరించిన గ్యాంగ్

పోలీసులు తనను అరెస్టు చేసేందుకు వచ్చారని తెలియగానే రౌడీషీటర్ అబ్దుల్‌తో పాటు అతని మద్దతుదారులు20 మందికి పైగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల అని కూడా చూడకుండా తోపులాటకు దిగారు. ఆ సందర్భంగా ఎస్‌ఐ ప్రకాష్ కాలికి గాయాలు అయ్యాయి. రౌడీషీటర్ అబ్దుల్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను అతని సహచరులు కత్తులతో బెదిరించి మర్యాదగా వెళ్లిపోకపోతే చంపేస్తామని రౌడీషీటర్ అనుచరులు పోలీసులను బెదిరించారు.

కౌన్సిలర్ తో సహ 10 మంది మీద ఎఫ్ఐఆర్

కౌన్సిలర్ తో సహ 10 మంది మీద ఎఫ్ఐఆర్

ఇదే సందర్బంలో పోలీసుల కళ్లు కప్పిన రౌడీషీటర్ మద్దతురాదులు రౌడీ అబ్దుల్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు సహకరించారు. ఈ ఘటనకు సంబంధించి లక్ష్మేశ్వర్ మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఫిర్దోష్‌ అదూర, ఇస్మాయిల్‌ అదూర, మహ్మద్‌ అదూర, నౌషాద్‌ అదూర, అత్తర్‌ సాబా ఆదూర, నిజాముద్దీన్‌ చంగాపురి, సులేమాన్‌ అదూర తో పాటు వాళ్ల మద్దతుదారులు అయిన 10 మందికిపైగా లక్ష్మేశ్వర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద రాత్రి పూట పోలీసుల మీద రౌడీషీటర్ అబ్దుల్, అతని అనుచరులు దాడులకు దిగడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. తప్పించుకుని పారిపోయిన రౌడీషీటర్ అబ్దుల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+